December 22, 2019

ఎంత గొప్పది బతుకుమీద ఆశ ఆ...


ఎంత గొప్పది
అంతరంగాలు (2005)
రచన: చెరుకూరి సుమన్
సంగీతం: సాలూరి వాసూరావు
గానం: బాలు

ఎంత గొప్పది
బతుకుమీద ఆశ ఆ...
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాసా...
ఇది భూమిపైన దేవుడి శ్వాస
మాయమవనిది మాసిపోనిది
మాయమవనిది మాసిపోనిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాసా...
ఇది భూమిపైన దేవుడి శ్వాస

గొంతు తుంచివేసినా
గులాబీ వికసించదా
పంజరంలోని చిలుకైనా
పలుకు ఆపివేస్తుందా?
గొంతు తుంచివేసినా
గులాబీ వికసించదా
పంజరంలోని చిలుకైనా
పలుకు ఆపివేస్తుందా?
బోయవాడి కోసమని లేడి
బోసినవ్వు మానుతుందా
బోయవాడి కోసమని లేడి
బోసినవ్వు మానుతుందా
చావులెన్నో తాను చూసినా
ఆశ చనిపోతుందా
చావులెన్నో తాను చూసినా
ఆశ చనిపోతుందా
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
ఇది భూమిపైన దేవుడి శ్వాస

మనిషి బతుకే ఓ కష్టాల కడలి
మనిషి బతుకే ఓ కష్టాల కడలి
జీవనయానంలో నైరాశ్యమో మజిలీ
జీవనయానంలో నైరాశ్యమో మజిలీ
ఎంత పగిలిన మనసైనా
పలుకకపోదూ
చివరకు చిగురుటాశల రవళి
ఎంత పగిలిన మనసైనా
పలుకకపోదూ
చివరకు చిగురుటాశల రవళి
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
భూమిపైన దేవుడి శ్వాస

నడిసంద్రంలోని నావను
నడిపించేదే ఆశా
ఉప్పెన ముంచెత్తినా
ఉదయాన్ని చూస్తే ఆశ
నడిసంద్రంలోని నావను
నడిపించేదే ఆశా
ఉప్పెన ముంచెత్తినా
ఉదయాన్ని చూస్తే ఆశ
చీకటిలో చిక్కినవారికి
చిరుదీపమే ఆశ
చీకటిలో చిక్కినవారికి
చిరుదీపమే ఆశ
విషాదాల నిషాదంలో
వివేకమేలే ఆశ
విషాదాల నిషాదంలో
వివేకమేలే ఆశ

ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
ఇది భూమిపైన దేవుడి శ్వాస
మాయమవనిది మాసిపోనిది
మాయమవనిది మాసిపోనిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
లోకమెంత మలినమైనా
మలిగిపోదిది
ఎంత గొప్పది
బతుకుమీద ఆశ
ఇది భూమిపైన దేవుడి శ్వాస
ఇది భూమిపైన దేవుడి శ్వాస