December 22, 2019

ఓ విధి విచిత్రాల నిధి

ఓ విధి విచిత్రాల నిధి
"విధి" సీరియల్ టైటిల్ సాంగ్

ఓ విధి విచిత్రాల నిధి
వింత కథల సారధి
ఆశనిరాశల వారధి
నిరంకుశ నిర్ణయాల
నిర్దయవావి ధి?
ఓ విధి విచిత్రాల నిధి

అన్నీ ఉన్నాయనిపిస్తూనే
అందకుండా చూస్తావు
సంపదలెన్నో ఇచ్చి
సంతోషం మాత్రం దాచేస్తావు
కోరికలని ఉరితీయాలని
నీకెంతో ఉబలాటం
ప్రాణాలతొ చెలగాటం
నీకు చేతివాటం
ఓ విధి విచిత్రాల నిధి
ఓ విధి విచిత్రాల నిధి

ఊహలు తలకిందులు చేసి
ఉనికిని చాటుకుంటావు
ఊహించని మలుపులతో
ఉసురు పోసుకుంటావు
మనసూ మమతల పై నీకు
అనాదిగా కక్షా
నీ చేతిలొ మనిషికీ
మనుగడే ఓ పరీక్ష

ఓ విధి విచిత్రాల నిధి
ఓ విధి విచిత్రాల నిధి