Showing posts with label ఇస్మార్ట్ శంకర్ (2019). Show all posts
Showing posts with label ఇస్మార్ట్ శంకర్ (2019). Show all posts

టైటిల్ సాంగ్ ఇస్మార్ట్ శంకర్

టైటిల్ సాంగ్
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
భాస్కరభట్ల రవికుమార్
అనురాగ్ కులకర్ణి

पता है मै कौन हूँ?
Shankar उस्ताद iSmart Shankar
గడబిడలకు बेफिकर
सड़क सड़क कड़क పొగర్
iStyle देखो नीचे ऊपर
ish ish iSmart'e
नाम भोले तो గల్లీ హడల్
Double दिमाग ఉంది इधर
करले अपने नीचे नजर
ish ish iSmart'e
ఏ' हैदराबाद शहर में पूछो बे साले
చార్మినార్ చాదర్ఘాట్ అంతా నాదే
హే' కిరి కిరి కిరి, కిరి కిరి కిరి,
కిరి కిరి కిరి జేస్తే मा की किरिकिरी
హహహా iSmart Shankar

యే' బీరేసుకుంటా బిందాసుగుంటా
భం భోలే శంభో శివ
నను పీకేటోడు దునియాల లేడు
యాడున్నా నాదే హవా
ఏదైనా గాని matter
चाय पत्ती पे settle
తెగలేదంటే अगर, सर पे पोड्ढू bottle (ఏయ్)
iSmileఏమో కిరాక్ brother
CutOutఏమో गरम figure
अक्कड़ बक्कड़ एक ही टक्कर
iSmart Shankar
దిగిండంటే खतम matter
మక్కలిరగదీసే meter
खटक मटक चटर-पटर
iSmart Shankar (ఓయ్)
హహహా iSmart Shankar
యే బొమ్మా!
నువ్ ఊఁ అంటే గోల్కొండ
రిపేర్ చేసి నీ చేతిల వెడ్త
నిన్ను బేగంని చేసి ఖిల్లా మీద కూర్సోవెడ్త
क्या बोलते? Aah?
चल बे साले నీలాంటోళ్ళని మస్తు చూసిన
दिलనే పతంగిలా ఎగరేస్కబోయే,
खद्दू का खीर लड़की
నా కంట్ల పడితే ఇడిసేదే లేదు,
పట్టేస్తా ఉరికీ ఉరికీ
बस है एक नजर
भजेगा दिल की buzzer
देदूंगा బంతి flower
घुंघुरू घुंघरू ఘల్ ఘల్
फिदा हुआ देख के शकल
లవ్ జేస్తా రాత్రి పగల్
కొనివెడ్తా కిలో నగల్
iSmart Shankar
నడుం జూస్తె centimetre
వెనకొస్తా kilometre
Gift ఇస్తా 7 Seater
iSmart Shankar
రేయ్ iSmart నువ్ తురుమ్ రా

ఉండిపో ఉండిపో

ఉండిపో ఉండిపో
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
భాస్కరభట్ల రవికుమార్
అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ..
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ..
ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ..
ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా
నీతోనె నిండిపోయే నా జీవితం
వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం..

మనసే మొయ్యలేనంతలా
పట్టి కొలవలేనంతలా
విప్పి చెప్పలేనంతలా
హాయే కమ్ముకుంటోందిగా
ఏంటో చంటిపిల్లాడిలా
నేనే  తప్పిపోయానుగా
నన్నే వెతుకుతూ ఉండగా
నీలో దొరుకుతున్నానుగా

ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ..
ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ..

సరికొత్త తడబాటే
మారింది అలవాటులాగా
ఇది చెడ్డ అలవాటే
వదిలేసి ఒకమాటు రావా
మెడ వంపు తాకుతుంటే మునివేళ్లతో
బిడియాలు పారిపోవా ఎటువైపుకో
ఆహా సన్నగా సన్నగా
సన్న జాజిలా నవ్వగా
ప్రాణం లేచి వచ్చిందిగా
మళ్ళీ పుట్టినట్టుందిగా
ఓహో మెల్లగా మెల్లగా
కాటుక్కళ్ళనే  తిప్పగా
నేనో రంగులరాట్నమై
చుట్టూ తిరుగుతున్నానుగా

తలనిమిరే చనువౌతా
నువ్ గాని పొలమారుతుంటే
ఆ మాటే  నిజమైతే..
ప్రతిసారి పొలమారిపోతా..
అడగాలి గాని నువ్వు అలవోకగా
నా ప్రాణమైన ఇస్తా అడగొచ్చుగా..
ప్రాణం నీదని నాదని
రెండూ వేరుగా లేవుగా
ఎపుడో కలుపుకున్నాం కదా
విడిగా ఉండలేనంతగా
ఉందాం అడుగులో అడుగులా
విందాం ప్రేమలో గలగల
బంధం బిగిసిపోయిందిగా
అంతం కాదులే మన కథ

రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
ఇస్మార్ట్ శంకర్ (2019)
మణిశర్మ
కాసర్ల శ్యామ్
రాహుల్ సిప్లిగంజ్, మోహన

నీ ముక్కుపోగు మెరుపులోన..
పొద్దుపొడిసె తూరుపులోన మైసమ్మా
ఎర్రా ఎర్రని సూరీడే..
నీ నుదుటున బొట్టయ్యే
ఓ సల్లనిసూపుల తల్లి మాయమ్మా

అమ్మలగన్న అమ్మరన్నా..
పచ్చి పసుపు బొమ్మరన్నా
యాపచెట్టు కొమ్మరన్నా..
ధూపమేసే దుమ్మురన్నా
ఆషాఢ మాసమన్నా..
అందులో ఆదివారమన్నా
కొత్త కుండల బోనమన్నా..
నెత్తికెత్తెను పట్నమన్నా
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

హే రాయ రాయె రాయ రాయె మైసమ్మ,
బల్కంపేటెల్లమ్మవే,
మా తల్లి బంగారు మైసమ్మవే
ఉజ్జయినీ మాంకాళివే..
మాయమ్మ ఊరూరా పోచమ్మవే
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో

రేవుల పుట్టింది.. రేణుక ఎల్లమ్మ
జెర్రిపోతుల తీసి జడల చుట్టింది
నాగుపాముల తీసి నడుముల కట్టింది
ఏడుగురు అక్కచెల్లెళ్లు ఎంటరాంగ
ఏడేడు లోకాలు ఏలుతున్నదమ్మ
మావురాల ఎల్లమ్మ దండాలు తల్లీ

దిస్ ఈజ్..బర్కత్ పుర
డీజే ఇస్మార్ట్..డిస్కో బోనాల్

పెయ్యి నిండ గవ్వల్ని పేసుకున్నవే
వెయ్యికళ్ళా తల్లీ నీకు యాటపోతులే
నిమ్మకాయ దండల్లో నిండుగున్నవే
కల్లూ కుండ తెచ్చి ఇక సాక పోస్తమే

అరె..
చింతా పూల చీరకట్టినవే
చేత శూలం, కత్తి పట్టినవే
మొత్తం దునియానే ఏలుతన్నావే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

జూబ్లీహిల్సు పెద్దమ్మవే..
మాయమ్మ జగమేలే మా తల్లివే
గోల్కొండ ఎల్లమ్మవే..
మాయమ్మ లష్కరుకే నువ్ రాణివే
హోసే... హోసే.. పోతరాజురో..
జజ్జనకర జజ్జనకర తీనుమారురో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండిమైసమ్మరో

ఏస్కో మామా తీన్మార్...

అగ్గి గుండాలల్లో నువ్వు భగ్గుమన్నవే
సుట్టూ ముట్టు సుక్కల్లొ ముద్దుగున్నవే
పుట్టలోనా ఉన్నట్టి మట్టిరూపమే..
బాయిలోన పుట్టి అల్లినావు బంధమే
గాలీ దూళీ.. అంతా నువ్వేలే
జాలీ గల్లా తల్లీ నువ్వేలే
ఈ జనమంతా నీ బిడ్డలే
రాయ రాయె రాయ రాయె మైసమ్మ,

బెజవాడ దుర్గమ్మవే..
మాతల్లి కలకత్తా మాంకాళివే
కంచిలోన కామాక్షివే..
మాయమ్మ మధురలోన మీనాక్షివే
యోసే.. యోసే..అరే ఈల గోలరో..
తొట్టేళ్లతో పొట్టేళ్ల బండి కదిలెరో
హోసే.. హోసే.. బోనాలురే
ఛలో ఛలో గండి మైసమ్మరో
దిస్ ఈజ్ హమారా కిర్రాక్
బోనాల్ బోనాల్