తరగని బరువైన
K.G.F. చాప్టర్-1 (2018)
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి.
సంగీతం: రవి బస్రూర్
గానం: అనన్య భట్
తరగని బరువైన వరమని అనుకుంటూ
తనువున మోసావె అమ్మ.
కడుపున కదలికలు కలవర పెడుతున్నా
విరివిగా పంచావె ప్రేమ...
కను తెరవకముందే కమ్మని నీ దయకు
ఋణపడిపోయింది జన్మ
తందాని నానే తానినన్నానో తానే నానే నో
చితికిన బతుకులలో చీకటి అడిగింది
వెతికే వేగుచుక్క ఎక్కడని
కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో
దినమొక నరకంగ ఎన్నాళ్ళని
అలసిన గుండెలలో ఆశలు వెలిగించు
అండై నీతో ఉన్నానని
తందాని నానే తానినన్నానో తానే నానే నో