Showing posts with label కేజీఎఫ్ (2018). Show all posts
Showing posts with label కేజీఎఫ్ (2018). Show all posts

సలాం రాకీ భాయ్


సలాం రాకీ భాయ్
కేజీఎఫ్ (2018)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: రవి బస్రూర్.
గానం: విజయ్ ప్రకాష్, శ్రీ కృష్ణ, లోకేశ్వర్,
            అరుణ్ కౌండిన్,ఆదిత్య అయ్యంగార్, గంటా రితేష్ 

చల్నే కా హుకుం
రుక్నేకా హుకుం
జిందగి పే హుకుం
మౌత్ పే హుకుం

బందూక్ పే హుకుం
దుష్మన్ పే హుకుం
లెహ్రోం పే హుకుం..
బొంబై పే హుకుం

జాన్ బొంబై కా
జాన్ బొంబై కా
జాన్ బొంబై కా
జాన్ రే
వీడి అడుగుల్లో
పిడుగు దాగుంది
అంతు చూస్తుంది
భాగ్ లే

ఆగ్, తూఫాన్
జబ్ భి మిల్తా హై 
ఐసా బారూద్
ఫైదా హోతా హై
ఏ ఖుదా జర దేఖో

జగమేలుతున్న సుల్తాను వీడే
జగడానికొస్తే సైతాను వీడే
ఏ ఖుదా జర రోఖో
గన్నంచుల్లో ధమ్కీ ..
కరుణేలేని కల్కి
బంబై కీ గలియా భీ
గభరాకే యూన్ భోలేంగే సాలా

సలామ్ రాకీ  భాయ్
రాక్ రాక్ రాకీ
సలామ్ రాకీ  భాయ్
సలామ్ రాకీ  భాయ్
సలామ్ రాకీ  భాయ్
ఇలాఖా తేరా భాయ్
తూ హై సబ్ కా భాయ్

అన్నీ తానై పెంచిన అడుగు ..
పరుగు నేర్పిన అమ్మ మాటే మంత్రం ..,
నిప్పు .. నొప్పి తెలిసిన ..
తప్పు .. ఒప్పు మరిచిన
గెలుపే వీడి సూత్రం

అక్షౌహిణి బలమైనా
ఇతగాడి పయనాన్ని ఆపేనా
అణ్వస్త్రపు అలలైనా
ఈ ధీరుడి కొనవేలు కదిపేనా

చర్బి జ్యాదా హై
హాత్ లోహా హై
డర్ కో బేచేగా
జాన్ ఘంఠా హై
హఠ్ జరా ఖత్రా హై 
గన్నంచుల్లో ధమ్కీ ..
కరుణేలేని కల్కి
బంబై కీ గలియా భీ
గభరా కే యూన్ భోలేంగే సాలా

సలామ్ రాకీ  భాయ్
రాక్ రాక్ రాకీ
సలామ్ రాకీ  భాయ్
సలామ్ రాకీ  భాయ్
సలామ్ రాకీ  భాయ్
ఇలాఖా తేరా భాయ్
తూ హై సబ్ కా భాయ్

తరగని బరువైన


తరగని బరువైన
K.G.F. చాప్టర్-1 (2018)
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి.
సంగీతం: రవి బస్రూర్
గానం: అనన్య భట్

తరగని బరువైన వరమని అనుకుంటూ
తనువున మోసావె అమ్మ.
కడుపున కదలికలు కలవర పెడుతున్నా
విరివిగా పంచావె ప్రేమ...
కను తెరవకముందే కమ్మని నీ దయకు
ఋణపడిపోయింది జన్మ
తందాని నానే తానినన్నానో తానే నానే నో

చితికిన బతుకులలో చీకటి అడిగింది
వెతికే వేగుచుక్క ఎక్కడని
కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో
దినమొక నరకంగ ఎన్నాళ్ళని
అలసిన గుండెలలో ఆశలు వెలిగించు
అండై నీతో ఉన్నానని

తందాని నానే తానినన్నానో తానే నానే నో

ఎవ్వడికెవడు బానిసా…


ఎవ్వడికెవడు బానిసా…
K.G.F. చాప్టర్-1 (2018)
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి.
సంగీతం: రవి బస్రూర్
గానం: అనన్య భట్

ఎవ్వడికెవడు బానిసా…
ఎవడికి వాడే బాద్ షా …
ఒత్తిచూసే తొత్తుకొడుకుల
నెత్తెక్కి ఆడే ధింసా….
ఉరిగా బిగిసే తాడే
ఊగే ఉయ్యాలా…
కరిగే మనసే మరిగిపోనీ లావాలా…
ఆయుధమే ఆగ్రహాల జ్వాలా….
రగిలే చూపులు మౌన శంఖారావంలా…
ఎగసే ఊపిరి యుద్ధభేరీ నాదంలా …
నిర్జించరా….
దౌర్జన్యాన్నీ వేళా…
ఆర్యుడా… సూర్యుడా…
కదలరా….
ధైర్యమే సైన్యమై
ఎదగరా….

నా అణువణువు నీవుగా…
ప్రతి క్షణము నీదిగా….
వేచా కాలమే సాక్షిగా….
నీ ప్రతి పదమున
జాడగా జయగీతము పాడగా…
లేనా వీడని తోడుగా…

ఒదిగిమదిగి ఉన్నా
ఓర్పే నిప్పల్లె
అణిచే అన్యాయాన్ని
అంతం చెయ్యాలే…
కత్తి దూసే…
సైనికుడై రారా….
బెదురు భయము లేని
ధైర్యం నువ్వేలే …
బడుగు జీవుల ఆశ
దీపం నువ్వేలే…
కన్నీళ్ళు తుడిచే
నాయకుడై రారా…
ఆర్యుడా… సూర్యుడా…
కదలరా….
ధైర్యమే సైన్యమై
ఎదగరా….