December 30, 2019

నీ కొంగున బంగరు రంగులతో

నీ కొంగున బంగరు
పొరుగింటి పుల్లకూర(1976)
సంగీతం: చక్రవర్తి
రచన: దాశరథి
గానం: బాలు, సుశీల

పల్లవి :

నీ కొంగున బంగరు రంగులతో..మంగళగీతం రాసేనా
నీ కొంగున బంగరు రంగులతో..మంగళగీతం రాసేనా

నీ మెరిసే మురిసే బుగ్గలపై..ముద్దుల బొమ్మలు గీసేనా
ముద్దుల...బొమ్మలు గీసేనా
నీ కొంగున బంగరు రంగులతో..మంగళగీతం రాసేనా
చరణం 1:

నీ పాటకు పల్లవినై నీ తోటకు మల్లియనై
నీ కధలకు..నేనే నాయికనై
నీలో ఊహలు రేపేనా..నిన్నే ఊయల లూపేనా
ఊయల...లూపేనా

నీ అందెల సవ్వడినై..ఆ సవ్వడి సరిగమనై
ఆ సరిగమలో..నీ మధురిమనై
నీలో..సుధలను నింపేనా..ఆ
వీడని తోడుగ నిలిచేనా..తోడుగ నిలిచేనా..ఆ

నీ కొంగున బంగరురంగులతో..మంగళ గీతం రాసేనా
నీ మంగళగాన తరంగంలో..పొంగుతు నాట్యం చేసేనా

చరణం 2:

నీ పెదవికి కానుకనై నీ తీయని..కోరికనై
అనురాగం చిందే గీతికనై..నీ తనువంతా నిండేనా
నా కన్నుల నిన్నే దాచేనా..కన్నుల నిన్నే దాచేనా
నీ సిగలో సంపెగనై నీ మోమున కుంకుమనై
నీ వలపుల..సందిట బందీనై
నీ కనుపాపగ నిలిచేనా..నీలో పాపగ పెరిగేనా
పాపగ..పెరిగేనా

నీ కొంగున బంగరు రంగులతో..మంగళ గీతం రాసేనా
నీ మంగళగాన తరంగంలో..పొంగుతు నాట్యం చేసేనా
నీ కొంగున బంగరు రంగులతో..మంగళ గీతం రాసేనా