December 23, 2019

నీ చూపులోనా విరజాజి వానా


నీ చూపులోనా విరజాజి వానా
చిత్రం: పిల్ల జమిందార్ (1980)
సంగీతం: చక్రవర్తి
రచన: వడ్డేపల్లి కృష్ణ
గానం: బాలు, సుశీల, ఎస్. పి. శైలజ

పల్లవి:

నీ చూపులోనా.. విరజాజి వానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. రతనాల వానా
ఆ వానలోనా మేను మరిచేనా... తీయగా

చరణం 1:

ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
ఆ వెన్నెలేమో.. పరదాలు వేసే
నీ వన్నెలేమో.. సరదాలు చేసే
వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ
వయసేమో పొంగిందీ... వలపేమొ రేగిందీ
కనివిని ఎరుగని తలపులు చిగురించె...

నీ చూపులోనా.. విరజాజి వానా
ఆ వానలోనా నేను తడిసేనా.. హాయిగా

నీ నవ్వులోనా.. వడగళ్ళ వానా
ఆ వానలోనా నేను మునిగేనా... తేలనా

చరణం 2:

చిరుగాలిలోనా... చిగురాకు ఊగే
చెలి కులుకులోనా... పరువాలు ఊగే

ఈ పాల రేయీ... మురిపించె నన్ను...
మురిపాలలోనా... ఇరికించె నన్ను...

గిలిగింత కలిగించే... మనసంత పులకించే...
జాబిల్లి కవ్వించే... నిలువెల్ల దహియించే...
చెరగని.. తరగని.. వలపులు కురిపించే...

నీ చూపులోనా... విరజాజి వానా
ఆ వానలోనా నేను తడిసేనా... హాయిగా

నీ నవ్వులోనా... రతనాల వానా
ఆ వానలోనా మేను మరిచేనా... తీయగా