నిజంగా నేనేనా

నిజంగా నేనేనా
కొత్త బంగారులోకం (2008)
రచన: అనంత శ్రీరామ్
సంగీతం: మిక్కీ జె. మేయర్
గానం: కార్తీక్

పల్లవి : 

నిజంగా నేనేనా... 
ఇలా నీ జతలో ఉన్నా.
ఇదంతా ప్రేమేనా 
ఎన్నో వింతలు చూస్తున్నా

యెదలో ఎవరో చేరి 
అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ 
నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా...

హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా...

నిజంగా నేనేనా 

చరణం 1:

ఈ వయస్సులో ఒకో క్షణం ఒకో వసంతం
నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం

అడుగులలోన అడుగులు వేస్తూ 
నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడచిన కాలం 
ఎంతని నమ్మనుగా

నిజంగా నేనేనా 

చరణం 2:

నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే
నా గతాలన్నీ కవ్వింతలై పిలుస్తు ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే

పెదవికి చెంప తగిలిన చోట 
పరవశమేదో తోడౌతుంటే
పగలే ఐనా గగనంలోన 
తారలు చేరెనుగా

నిజంగా నేనేనా