Showing posts with label కొత్త బంగారు లోకం (2008). Show all posts
Showing posts with label కొత్త బంగారు లోకం (2008). Show all posts

నేనని నీవనీ...

నేనని నీవనీ...
కొత్త బంగారు లోకం (2008)
శ్వేతా బసు ప్రసాద్
మిక్కీ జె. మేయర్

నేనని నీవనీ... వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైనా...
నేను ని నీడని... నువ్వు నా నిజమనీ... ఒప్పుకోగలరా ఇపుడైనా...
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే...
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే...

మొదటిసారి మదిని చేరి నిదర లేపిన ఉదయమా...
వయసులోని పసితన్నాన్ని పలకరించిన ప్రణయమా...
మరీ కొత్తగా... మరో పుట్టుక...
అనే టట్టుగా ఇది నీ... మా...యే...న....

నేనని నీవనీ... వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైనా...
నేను ని నీడని... నువ్వు నా నిజమనీ... ఒప్పుకోగలరా ఇపుడైనా...
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే...
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే...

పదము నాది పరుగు నీది రిథము వేయరా ప్రియతమా...
తగువు నాది తెగువ నీది గెలుచుకో పురుషోత్తమా...
నువ్వే దారిగా... నేనె చేరగా...
ఎటూ చూడకా వెనువెంటే రానా...

నేనని నీవనీ... వేరుగా లేమని... చెప్పినా వినరా ఒకరైనా...
నేను ని నీడని... నువ్వు నా నిజమనీ... ఒప్పుకోగలరా ఇపుడైనా...
రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే...
అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే...

నిజంగా నేనేనా

నిజంగా నేనేనా
కొత్త బంగారులోకం (2008)
రచన: అనంత శ్రీరామ్
సంగీతం: మిక్కీ జె. మేయర్
గానం: కార్తీక్

పల్లవి : 

నిజంగా నేనేనా... 
ఇలా నీ జతలో ఉన్నా.
ఇదంతా ప్రేమేనా 
ఎన్నో వింతలు చూస్తున్నా

యెదలో ఎవరో చేరి 
అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకే ఉంటూ 
నీపై నన్నే తోస్తున్నారా

హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా...

హరే హరే హరే హరే హరే రామా
మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో ఉషారుగా ఉన్నాదే లోలోన ఏమ్మా...

నిజంగా నేనేనా