December 26, 2019

ఏవో మౌనరాగాలు

ఏవో మౌనరాగాలు
చిత్రం:  పగబట్టిన పడుచు (1971)
రచన: సినారె
సంగీతం:  యం. రంగారావు
నేపధ్య గానం: సుశీల

పల్లవి::

ఓహో..ఓహో..ఓహో..
ఓహో..ఓహో..ఓహో
ఏవో మౌన..రాగాలు
ఏవో మధుర..భావాలు
నాలో కదలె..ఈ వేళ
ఏవో మౌన..రాగాలు
ఏవో మధుర..భావాలు
నాలో కదలే..ఈ వేళ

తుంటరి వయసేమన్నది
తూగాడు నడుమేమన్నది
చెరలాడు పైటేమన్నది
విరహాలు ఇక చాలన్నది 
తుంటరి వయసేమన్నది
తూగాడు నడుమేమన్నది 
చెరలాడు పైటేమన్నది
విరహాలు ఇక చాలన్నది 
రారా..ఓ చిన్నవాడా
వలపే నీదేరా..నీదే లేరా 
ఏవో మౌన..రాగాలు
ఏవో మధుర..భావాలు
నాలో కదలే..ఈ వేళ

చరణం::1

మాధవుడందని..రాధనై
ఆరాధ తీయని..బాధనై
ఆ బాధ మోయని..గాధనై
ఎన్నాళ్ళు జాగ..తిరిగేను
మాధవుడందని..రాధనై
ఆరాధ తీయని..బాధనై
ఆ బాధ మోయని..గాధనై
ఎన్నాళ్ళు జాగ..తిరిగేను 
రారా..ఓ చెలికాడా నేనే
ఆ రాధనురా..నీ రాధనురా
ఏవో మౌన..రాగాలు
ఏవో మధుర..భావాలు
నాలో కదలే..ఈ వేళ