ధీంతనక్కు తాళం
చిత్రం: సంకల్పం (1995)
రచన: భువనచంద్ర
గానం: బాలు, చిత్ర
సంగీతం: కోటి
ధీంతనక్కు తాళం
అలనాటి జ్ఞాపకం
ధీంతనక్కు తాళం
తొలి స్నేహసంగమం
ధీంతనక్కు తాళం
అలనాటి జ్ఞాపకం
ధీంతనక్కు తాళం
తొలి స్నేహసంగమం
రాగాలతో అనురాగాలతో
నీ గుండెలో తలదాచుకున్న ఆ క్షణం
ధీంతనక్కు తాళం
అలనాటి జ్ఞాపకం
ధీంతనక్కు తాళం
తొలి స్నేహసంగమం
చరణం 1:
సిరిమల్లె తోటలో మరుమల్లె మాలనై
పెనేశాను నిన్నే నేస్తమా
పెనేశాను నిన్నే నేస్తమా
చివురాకు నీడలో చిలకమ్మ గూటిలో
వరించావు నన్నే ప్రాణమా
వరించావు నన్నే ప్రాణమా
మరచితివా వలపు కథా
మనసుపడే వయసు వ్యథా
నీకోసమే కౌగిలి కోసమే
నే వేచిఉన్న ఆ క్షణం
ధీంతనక్కు తాళం
అలనాటి జ్ఞాపకం
ధీంతనక్కు తాళం
తొలి స్నేహసంగమం
చరణం 2:
చివురించే ఆశలా చిరుగాలి శ్వాసలా
తపించాను నీకై హృదయమా
తపించాను నీకై హృదయమా
పరువాల కోనలో
పడిలేచే వేళలో
తరించాను నీతో ప్రియతమా
తరించాను నీతో ప్రియతమా
ఒక నిముషం పరవశమా
మరు నిముషం కలవరమా
నీవాడినై వలచినవాడినై
నీ గుండెలో తలదాచుకున్న ఆ క్షణం
ధీంతనక్కు తాళం
అలనాటి జ్ఞాపకం
ధీంతనక్కు తాళం
తొలి స్నేహసంగమం
రాగాలతో అనురాగాలతో
నీ గుండెలో తలదాచుకున్న ఆ క్షణం