నవ్వని పువ్వే నవ్వింది
చదరంగం (1967)
టి.వి.రాజు
ఘంటసాల, సుశీల
నవ్వని పువ్వే నవ్వింది
తన తుమ్మెదరాజును రమ్మంది
నవ్వని పువ్వే నవ్వింది
తన తుమ్మెదరాజును రమ్మంది
నవ్వని పువ్వే నవ్వింది
రమ్మంటేనే చాలదులే
నీ కమ్మని వలపులు కావాలీ
రమ్మంటేనే చాలదులే
నీ కమ్మని వలపులు కావాలీ
రమ్మంటేనే చాలదులే
మక్కువగొలిపి మనసులు చిలికి
మధువులు గ్రోలాలి నీవే
అలాగా...
మక్కువగొలిపి మనసులు చిలికి
మధువులు గ్రోలాలి నీవే
దాచిన తేనెలు దోచే సమయం
దాచిన తేనెలు దోచే సమయం
ఎన్నడు రానున్నదో
రమ్మంటేనే చాలదులే
నీ కమ్మని వలపులు కావాలీ
రమ్మంటేనే చాలదులే
ఇద్దరమొకటై సరే అనుకుంటే
పెద్దలు దీవింతురోయీ
ఇద్దరమొకటై సరే అనుకుంటే
పెద్దలు దీవింతురోయీ
అందాలొలికే పందిరి కింద
అందాలొలికే పందిరి కింద
బంధము వేసేరులే
ఇరువురి నడుమ దూరాలన్నీ
కరిగి పోయేనులే
నీలో నేనై నాలో నీవై
కలిసిపోయేములే
నవ్వని పువ్వే నవ్వింది
మనమిరువురినొకటై పొమ్మంది
నవ్వని పువ్వే నవ్వింది