December 26, 2019

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
చిత్రం: కార్తికేయ (2014)
రచన: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: రంజిత్

పల్లవి:

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో ఏ చోటో లేదురా
శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంట

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే.... ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా

చరణం-1:

పలు రంగులు దాగి లేవా పైక్కనిపించే తెలుపులోన
చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏ జవాబు, తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించారా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే నింగినే ... నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం ... లేకుంటే ఎలా

చరణం-2:

ఎపుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట
ఎదిగే ప్రతి మలుపుతోను మార్చలేదా మనిషి బాట
తెలియని తనమే పునాది... తెలిసిన క్షణమే ఉగాది
తెలివికి గిరిగీత ఏది... ప్రయత్నించరా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...
బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...
అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా