December 26, 2019

శ్రీకర శుభకర ప్రణవ స్వరూప

శ్రీకర శుభకర ప్రణవ స్వరూప
చిత్రం : త్రినేత్రం (2002)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
గానం: బాలు

నరసింహా.. లక్ష్మీనరసింహా
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
నీవే శరణమయా ఓ యాదగిరీ నరసింహా
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా
పురాణ యుగమున ఈ గిరి పైనే తపమొనరించెను యాదర్షి
ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి
ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాలా నరసింహుడు
భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీనరసింహుడు
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు
నమో నమః నమో నమః
నమస్కరించెను నాలుగు దిక్కులు నఖమున వెలుగుతు మ్రొక్కెను చుక్కలు
గోపుర రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము
మంగళ హారతులిచ్చినది మహా కాల చక్రము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా

ఈ స్వామి పాదములు బ్రహ్మ కడుగగా విష్ణుకుండమే ప్రభవించే
ఇట స్నానము చేసిన జన్మ ధన్యమే ఖర్మ విమోచనమే
ఇట విశ్వ వైద్యుడై స్వామియే చేయును రోగ నివారణమే
చిత్తము దేహము సత్వము కావును బెత్తము తాకగనే
భోగభాగ్యాలు ధీర్ఘాయువొసగేను గిరి ప్రదక్షిణం
భోగభాగ్యాలు ధీర్ఘాయువొసగేను గిరి ప్రదక్షిణం
నమో నమః నమో నమః
క్షేత్ర పాలకుడు ఆంజనేయుడే సాక్షి ఔను ఈ మహిమలకు
కలియుగ దైవము యాదగిరి శ్రీ నరసింహుని దర్శనం
కోరిన కోర్కెలు తీర్చేటి మహా కల్పవృక్షము
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా

భూత ప్రేత పిశాచ రాక్షసుల పారద్రోలు నీ నామమే
క్షుద్ర శక్తులను బాణామతులను దగ్ధమొనర్చును స్మరణమే
ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్య కశిపుడు హింసింపగనే
సర్వ కాలముల సర్వా వస్తల సర్వ దిక్కులకు వ్యాపించి
సంరక్షింపుము నరసింహా.. అనుగ్రహింపుము నరసింహా.. యాదగిరీశా నరసింహా
శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీనరసింహా
పదునాలుగు లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహా