ఓ నాన్నా నీ నాన్న కన్నుల్లో
భగవాన్ (1989)
రాజ్-కోటి
బాలు, జానకి
ఓ నాన్నా నీ నాన్న కన్నుల్లో వెన్నెల్లు నీవేనురా
నీకన్నా నాకింక లోకాన మేలైన సిరులేవిరా?
నేనున్నా లేకున్నా ఈపాటే నీ తోడు కావాలి.
ఓ నాన్నా నీ నాన్న కన్నుల్లో వెన్నెల్లు నీవేనురా
నీకన్నా నాకింక లోకాన మేలైన సిరులేవిరా?
మురిపాలు పంచగా
నీ అమ్మ లేదురా
సిరులందు పెంచగా
నీ నాన్న పేదరా
మురిపాలు పంచగా
నీ అమ్మ లేదురా
సిరులందు పెంచగా
నీ నాన్న పేదరా
ఇక అమ్మైన నాన్నైన నేనేర
నీకింక లోకాన
ఓ నాన్నా నీకంట కన్నీరు రానీకు ఏనాటికీ
నువ్వంటే ముద్దంట...ఇంకేమి వద్దంట ముమ్మాటికీ
ఇక అమ్మైన నాన్నైన నువ్వేగ
మాకింక లోకాన
ఓ నాన్నా నీకంట కన్నీరు రానీకు ఏనాటికీ
నువ్వంటే ముద్దంట...ఇంకేమి వద్దంట ముమ్మాటికీ
ఒక మంచి అన్నదీ మనమెంచుకున్నది
ఇక వంచనన్నదీ మన్నించలేమది
ఒక మంచి అన్నదే మనమెంచుకున్నది
ఇక వంచనన్నది మన్నించలేమది
కలకానిది కథకాదిది విలువైనది
ఈ బంధమేనాడు...
ఓ నాన్నా నీ నాన్న కన్నుల్లో వెన్నెల్లు నీవేనురా
నీకన్నా నాకింక లోకాన మేలైన సిరులేవిరా?
నేనున్నా లేకున్నా ఈపాటే నీ తోడు కావాలి.