జీవన వేణువు పాడెను
సూర్యచంద్ర (1985)
సంగీతం::రమేష్‌నాయుడు
రచన::వేటూరి
గానం::సుశీల, రాజ్ సీతారామ్
పల్లవి::
జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..
పూజనీ నీ పూజనీ
జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..పూజనీ నీ పూజనీ
చరణం::1
ఈ ప్రణయాలూ అభిమానాలూ..దాచాలంటే దాగనివేలే
సూర్యుడు నీవై చూసే వేళ..ఎదలో పద్మం విరిసెనులే
ఆఆఅ..ఆఅ..హాహహాహా..అఅ..ఆఆఆ..హాహాహా..అ
చంద్రుడు నీవై పిలిచే వేళ..నాలో తారక మెరిసెనులే
జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..పూజనీ నీ పూజనీ
చరణం::2
నీ చిరునవ్వే నా సిగపూలై ప్రేమ సుగంధం చల్లెను నాలో
కన్నుల మెరిసే కాటుక లేఖ వివరాలన్నీ తెలిసెనులే
ఆఆఅ..ఆఅ..హాహహా.అ..ఆఆఆ..హాహా..అఅ
కౌగిలి గుడిలో కన్నెతనాలా..కళ్యాణాలే జరిగెనులే
జీవన వేణువు పాడెను..ఏమనీ ఏమేమనీ
నవ జీవన గీతికి పల్లవి..నీవనీ నీ ప్రేమనీ
సాగనీ ప్రియరంజనీ..పూజనీ నీ పూజనీ