దేవుడు కరుణిస్తాడని
ప్రేమకథ (1999)
సిరివెన్నెల
సందీప్ చౌతా
రాజేష్, అనురాధా శ్రీరామ్
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటె వినీ
నమ్మలేదు నేను నీ నీడకు చేరేవరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైనా కడ దాక సాగనా
నువ్వు ఉంటేనె ఉంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతె బ్రతుకులో ప్రతి క్షణం సుఖమేగ నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్నా
ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళవరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు
ఎటెళ్ళేదొ జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదా నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వూ నాతో లేకుంటే నేనంటు ఉంటానా