December 26, 2019

మల్లి ..మల్లి.. మల్లి

మల్లి ..మల్లి.. మల్లి
ఆలుమగలు (1992)
సిరివెన్నెల
బాలు
శ్రీలేఖ

మల్లి ..మల్లి.. మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ ... మళ్ళీ..
తుళ్ళి.. తుళ్ళి తుళ్ళి గుండె గుడి గంటెయ్ మోగిందే మళ్ళీ మళ్ళీ
నీ ఊహలె నీ ఊసులె నా ఊపిరిలో పలికే మురళి... రవళి
మల్లి మల్లి మల్లి అంటూ నీ పేరే అంటుంటే మళ్ళీ మళ్ళీ

మృదువయిన లేఖ ...మధుమాస లేఖ
అది అందినాక కుదురేదికా..
విరబూసినాక.... దరహాస రేఖ
విరితేనెవాకా .... ఎద నిండగా
వెలుగు చిలుకు కోరిక ఇలకు దిగిన తారక
మదన కధల తొలి వేదికా....
మునిమాపుల కనుపాపల మది గీతిక నీవేనే మల్లి మల్లి......

సుకుమారమయిన కుసుమారివయినా రసరాజ్యమేలే నా రాణివే...
నెలరాజుకయిన వలరాజుకయినా విరహాలు రేపే నేర జాణవె
పడుచు కలల గీతిక కవి తలపులు కదలిక పరిమళాల స్వరమాలికా
నీ వన్నెలు నీ చిన్నెలు ఎన్నెన్నని వర్ణించనె ...మల్లి మల్లి.......