December 26, 2019

చిన్నా చిరుచిరు నవ్వుల చిన్నా


చిన్నా.... చిరుచిరునవ్వుల
చిత్రం : ప్రియరాగాలు (1997)
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కీరవాణి
గానం : చిత్ర

చిన్నా చిరుచిరు నవ్వుల చిన్నా
కన్నా చిట్టి పొట్టి చిందులు కన్నా
నా ప్రేమ పోతపోసి కన్నానురా
నిను శ్రీరామ రక్షలాగ కాపాడగా
నీలో ఉన్నా నీతో ఉన్నా

అటు చూడు అందాల రామచిలకనీ
చూస్తోంది నిన్నేదో అడుగుదామనీ
నీ పలుకు తనకి నేర్పవా అనీ
ఇటు చూడు చిన్నారి లేడిపిల్లనీ
పడుతోంది లేస్తొంది ఎందుకోమరీ
నీలాగ పరుగు చూపుదామనీ
కరిగిపోని నా తీపి కలలనీ
తిరిగిరాని నా చిన్నతనమునీ
నీ రూపంలో చూస్తూ ఉన్నా

తూనీగ నీలాగ ఎగరలేదురా
ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా
ఈ పరుగు ఇంక ఎంతసేపురా
ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
నా గారాల మారాజ కాస్త ఆగరా
నీ వెంట నేను సాగలేనురా
ఎంతవెతికినా దొరకనంతగా
ఎంత పిలిచినా పలకనంతగా
వెళ్ళిపోకమ్మా..రారా కన్నా