ఏవిటో ఏమో ఈ ప్రేమా
చిత్రం : రంగేళి (1995)
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : A R రెహమాన్
గానం : హరిహరన్, కవితా కృష్ణమూర్తి
ఏవిటో ఏమో ఈ ప్రేమా
శాపమో, వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమా
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో, అమృతమో చెప్పేవారే లేరమ్మా
చరణం 1:
ఏ నిమిషం ఇది మొదలవుతుందో తెలియదు
గుండెల్లో చేరేముందు అనుమతి అడుగదు
మనసుంటే ప్రే...మించక మానదు
ప్రేమిస్తే మనదంటూ...మనసే మిగలదు
అక్షరాలు రెండే అయినా
లక్షలాది కథలను వ్రాసే
ఈ ప్రేమలో పడి నిలబడ తరమా...
చరణం 2:
ఆ...
పగలేమో తరగని అల్లరి ఊసులు
రాత్రంతా కరగని తీయని ఊహలు
కలిసిన క్షణమున నిలవని తపనలు
ఏకాంతంలోనైనా విడవని తలపులు
ఋతువులకే రంగులు మార్చి
మెలఁకువకే కలలను నేర్పే
ఈ ప్రేమ గారడీ
ఎవ్వరి మహిమా...?
ఏవిటో ఏమో ఈ ప్రేమా
శాపమో, వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమా
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో, అమృతమో చెప్పేవారే లేరమ్మా