December 23, 2019

జివ్వుమని కొండగాలీ



జివ్వుమని కొండగాలీ
చిత్రం :  లంకేశ్వరుడు (1989)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  మనో,  జానకి

పల్లవి :

జివ్వుమని కొండగాలీ 
కత్తిలా గుచ్చుతుందీ
వెచ్చనీ..కోరికా..రగిలిందిలే....
నీవేనా..ప్రేయసివే..నీదేలే..
అందుకో ప్రేమగీతం

కస్సుమని పిల్లగాలి 
నిప్పులా అంటుతుందీ
తీయనీ..కానుకా..దొరికిందిలే.....
నీవేనా..ప్రేమవులే..నీకేలే..
అందుకో ప్రేమగీతం
జివ్వుమని కొండగాలీ 
కత్తిలా గుచ్చుతుందీ...

చరణం 1 :

ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..
కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ
ఒంపుల్లో సొంపుల్లో అందముందీ..
కసిచూపుల్లో ఊపుల్లో పందెముందీ

కాశ్మీర కొండల్లో అందాలకీ..
కొత్త అందాలు ఇచ్చావూ
కాశ్మీర వాగుల్లో పరుగులకీ..
కొత్త అడుగుల్ని నేర్పావూ
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి
కస్సుమని పిల్లగాలి 
నిప్పులా అంటుతుందీ


చరణం 2 :

మంచల్లే కరగాలీ మురిపాలూ..
సెలయేరల్లే ఉరకాలీ యవ్వనాలూ
మంచల్లేకరగాలీ మురిపాలూ..
సెలయేరల్లే ఉరకాలీ యవ్వనాలూ

కొమ్మల్లో పూలన్ని పానుపుగా 
మన ముందుంచె పూలగాలీ
పూవుల్లో దాగున్న అందాలనీ 
మన ముందుంచె గంధాలుగా
నేనే..నిను కోరి చేరి వాలిపోవాలి

జివ్వుమని కొండగాలీ 
కత్తిలా గుచ్చుతుందీ
కస్సుమని పిల్లగాలి 
నిప్పులా అంటుతుందీ..