Showing posts with label కవితా కృష్ణమూర్తి. Show all posts
Showing posts with label కవితా కృష్ణమూర్తి. Show all posts

ఊహలేవో రేగే



ఊహలేవో రేగే
చిత్రం: అంతం (1992)
సంగీతం: ఆర్.డి. బర్మన్, మణిశర్మ
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: మనో, కవితాకృష్ణమూర్తి

పల్లవి:

హే...ఊహలేవో రేగే..
ఊహలేవోరేగే ఊపుతో ననులాగే
వేడిసెగలై సాగే చిలిపి చలిచెలరేగే
ఆదుకోవా అయిన దాన్నేగా

పూలతీగై ఊగే లేతసైగేలాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే
అందుకోవా ఆశేతీరగా

ఊహలేవోరేగే ఊపుతోననులాగే
హాయికథ కొనసాగే రేయిపగలు ఇలాగే

అమ్మాయే సన్నగ

అమ్మాయే సన్నగ
ఖుషి (2001)
చంద్రబోస్
మణిశర్మ
కవితా కృష్ణమూర్తి, ఉదిత్ నారాయణ

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే

ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే
ప్రేమలు పండే వేళ జగమంత జాతరలే

ప్రేమే తోడుంటె పామైన తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైన పరుపేలే

నీ ఒంట్లో ముచ్చెమటైన నా పాలిట పన్నీరే
నువ్విచ్చె పచ్చి మిరపైన నా నోటికి నారింజె

ఈ వయసులో ఈ వరసలో
ఈ వయసులో ఈ వరసలో నిప్పైనా నీరేలే

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే

నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖ చిత్రం
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం

ఎగిరే నీ పైటే కలిగించె సంచలనం
ఒలికే నీ వలపే చెయ్యించే తలస్నానం

యెండల్లొ నీరెండల్లో నీ చెలిమె చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవి కిరణం

పులకింతలె మొలకెత్తగ
పులకింతలే మొలకెత్తగ ఇది వలపుల వ్యవసాయం

అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే

ఏవిటో ఏమో ఈ ప్రేమా



ఏవిటో ఏమో ఈ ప్రేమా
చిత్రం : రంగేళి (1995)
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : A R రెహమాన్
గానం : హరిహరన్, కవితా కృష్ణమూర్తి

ఏవిటో ఏమో ఈ ప్రేమా
శాపమో, వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమా
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో, అమృతమో చెప్పేవారే లేరమ్మా

చరణం 1:

ఏ నిమిషం ఇది మొదలవుతుందో తెలియదు
గుండెల్లో చేరేముందు అనుమతి అడుగదు
మనసుంటే ప్రే...మించక మానదు
ప్రేమిస్తే మనదంటూ...మనసే మిగలదు
అక్షరాలు రెండే అయినా
లక్షలాది కథలను వ్రాసే
ఈ ప్రేమలో పడి నిలబడ తరమా...

చరణం 2:

ఆ...
పగలేమో తరగని అల్లరి ఊసులు
రాత్రంతా కరగని తీయని ఊహలు
కలిసిన క్షణమున నిలవని తపనలు
ఏకాంతంలోనైనా విడవని తలపులు
ఋతువులకే రంగులు మార్చి
మెలఁకువకే కలలను నేర్పే
ఈ ప్రేమ గారడీ
ఎవ్వరి మహిమా...?

ఏవిటో ఏమో ఈ ప్రేమా
శాపమో, వరమో ఈ ప్రేమ
నీతో ఆడుతుంది ప్రేమా
నిను వేటాడుతుంది ప్రేమ
విషమో, అమృతమో చెప్పేవారే లేరమ్మా

ఉట్టి మీద కూడు


ఉట్టి మీద కూడు
చిత్రం: ఒకే ఒక్కడు (1999)
సంగీతం: ఏ. ఆర్. రెహమాన్
సాహిత్యం: ఎ.ఎమ్.రత్నం, శివ గణేష్
గానం: శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి

యే... చంద్రముఖి...

హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ నాకు

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ హే...

ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

కొర్రమీను తుళ్ళే కాలువలో
రెళ్లుగడ్డి మొలిచే రేగడిలో
నాతోటి బురద చిందులాడు
తై తై తై తై తై
సరిగంగ స్నానాలు చేద్దామా
సిగ్గువిడిచి వెయ్ వెయ్
లై లై లై లై లై లై లై,
లై ల లై లై లై లై లై
పోకలు రాకలు కల్లేనోయ్
బ్రతికే నిమిషం నిజమేనోయ్
ఏ అరటిఆకున నిన్నే విందుగ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్
అశే పాపం హాయ్ హాయ్ హయ్
చెవిలో గోల గోయి గోయి గోయి
పరువపు వయసు సేవలనీ
చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్

కోల అ కోల కోలగల,
కోల అ కోల కోలగల
కోల అ కోల కోలగల,
కోల కోల కోల కోల కోలగల

హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ నాకు

ఓ... చంద్రముఖి, చంద్రముఖి
ఓ... లై ల లై లై లై లై చంద్రముఖి

లేలే లేలే లేలే లే లేలే లేలే లేలే
లై లైలై లైలై లైలై లైలై లైలై లై లై

గాలి తప్ప దూరని అడవిలో
తుర్రుపిట్ట పిట్ట కట్టిన గూటిలో
ఒక రోజు నాకు విడిది చెయ్
ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్ ఒయ్
నువు చీర దొంగిలించి పోయినా
పరువు నిలుపు నాచే
వలువలు అన్నవి కల్లేనోయ్
దాగిన ఒళ్ళే నిజమేనోయ్
వలువలు అన్నవి కల్లేనోయ్
దాగిన ఒళ్ళే నిజమేనోయ్
అంతటి అందం నాకే సొంతం
హొయ్ హొయ్ హొయ్ హొయ్ హొయ్
యెదలో రొదలె తై తై తై
తలచిన పనులే చెయ్ చెయ్ చెయ్
మేను మేను కలవడమే
హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్

ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నేను చాల నీకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనా నీకు

హే ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు
వడ్డించ నువ్వు చాలు నాకు
ముద్దుపెట్టి నెత్తిన గుండెల మధ్యన
చచ్చిపోవ తోచెనమ్మ హే...

ఓ... ఏటి గట్టుమీద తూనీగే పడదామా
కాకి ఎంగిలిలా ఒక పండే తిందామా

గోల అ గోల అ గోల గోలా