December 26, 2019

సిరి చందనపు చెక్క లాంటి భామ


సిరి చందనపు చెక్క లాంటి భామ
ముద్దుల ప్రియుడు (1994)
వేటూరి
కీరవాణి
బాలు, చిత్ర, కీరవాణి

సిరి చందనపు చెక్కలాంటి భామ
నంది వర్దనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా
ఒంటిగుంటే తోచదు ఒక్కసారి చాలదు
ఒప్పుకుంటే అమ్మడు తప్పుకోడు పిల్లడు
యమ యమా..మా మా మా మా మా..

సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్దనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా

చిక్కు చిక్కు చిక్కు చిక్కు చిలకా నీ పలుకే బంగారమా
సిగ్గు సిగ్గు సిగ్గు సిగ్గు మొలకా నీ అలకే మందారమా
ఇది కోకిలమ్మ పెళ్ళిమేళమా నీ పదమా
అది విశ్వనాథ ప్రేమగీతమా నీ ప్రణయమా
తుంగ భద్ర కృష్ణా ఉప్పొంగుతున్న కొంగు దాచే అందాలెన్నమ్మా
ఊపులో...ఉన్నాలే భామా..

సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్దనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా

పిచ్చి పిచ్చి పిచ్చి పిచ్చి ప్రియుడా నీ పిలుపే సిరివాదమా
గుచ్చి గుచ్చి కౌగిళ్ళిచ్చు గురుడా నీ వలపే ఒడి వేదమా
ఇది రాధ పంపు రాయబారమా నీ స్వరమా
ఇది దొంగచాటు కొంగ వాటమా ఓ ప్రియతమా
ముద్దు మువ్వ నవ్వు కవ్వించుకున్న వేళ కవ్వాలాడే మోతమ్మా
చల్లగా..చిందేసే ప్రేమా...

సిరి చందనపు చెక్కలాంటి భామ
నందివర్దనాల పక్క చేరవమ్మా
వంగి వందనాలు పెట్టుకుందునమ్మా
కొంగు తందనాలు లెక్కపెట్టు మామా