December 23, 2019

దొండపండు లాంటి పెదవే నీది



దొండ పండు
పెళ్ళాం ఊరెళితే (2003)
మణిశర్మ
చంద్రబోస్
హరిహరన్, కల్పన

పల్లవి: 

దొండపండు లాంటి పెదవే నీది..
అబద్దం..అంతా అబద్దం..
దూదిపింజ లాంటి పదమే నీది... 
అబద్దం.. అంతా అబద్దం..
పాలమీగడంటి నుదురే నీది.. 
అబద్దం..
పూలతీగ లాంటి నడుమే నీది..
అబద్దం..
నీ పైన నా ప్రేమ అబద్దమనకూ 
అనకూ అనకూ..

చరణం 1: 

రత్నాలు చిందేటి నవ్వేమొ నీది.. 
అబద్దం..
నిన్ను నవ్వుల్లో ముంచెత్తు బాధ్యత నాది..
ఇది నిజం
ముత్యాలు రాలేటి మాటేమొ నీది..
అబద్దం
నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాది... 
ఇది నిజం
నేలమీద ఉన్న దేవత నీవు..
అబద్దం
నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేను..
ఇది నిజం
నువు పొగిడే ప్రతి పాట తీపి అబద్దం
నను మెప్పించాలనే తాపత్రయం గొప్ప వాస్తవం

చరణం 2: 

పాలసరసు లాంటి పైటేమో నీది ..
ఆ హ హ అబద్దం
నీ పైట మాటునున్న మనసేమొ నాది 
ఆ ..ఇది నిజం
గోరింట పువ్వంటి చెయ్యేమొ నీది..
అహ మళ్ళీ అబద్దం
నీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది..
అహా ఇది నిజం
నీలాలు కొలువున్న కళ్ళేమొ నీవి 
అబద్దం
నువ్వు కన్నెర్ర చేస్తేనే కన్నీరు నేను..
ఇది నిజం
నీ పైన అనుమానం క్షణకాలం
మన ఇద్దరి మధ్యన అనుబంధం కలకాలం