December 23, 2019

మిల మిల మెరిసే

మిల మిల మెరిసే
పెళ్ళాం ఊరెళితే (2003)
మణిశర్మ
సిరివెన్నెల
బాలు, గోపికా పూర్ణిమ

|పల్లవి||

మిల మిల మెరిసే మగువా నువు మేనక చెల్లెలివా
నిగ నిగలాడే భామా నునులేత పసిడి కొమ్మా
గడసరి పలుకుల గువ్వా నువు మదనుడి మరదలివా
గుబ గుబలాడెను ఊటి నిను చూసి అయ్యోరామా
కళ్ళే చూసెనంటె KODAK..... పళ్ళే చూసెనంటె CLOSE-UP
థ్రిల్లై గంతులేస్తు రావా నీకోసం.......
కురులే చూసెనంటె SUNSILK..... నవ్వే చూసెనంటె NESCAFE
తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం....... ||మిల మిల||

||చరణం 1||

మెరుపులన్ని మెలివేసి....... తారలన్ని కలబోసి.....
పున్నమంత మరిగించి...... పుణ్యమంత కరిగించి......
నవ నవలాడేలా నవ బ్రహ్మలు చేరి.....
తన్మయమై నిన్ను చేశారే కోరి
పలుకే వినినా తేనే చినబోవు
సొగసే కనినా తూర్పుకు మతిపోవు
కలరే చూసెనంటె ASIAN..... రిస్టే చూసెనంటె TITAN.....
నీకై లక్షలుంచిపోవా వాకిట్లో...... ||మిల మిల||

||చరణం 2||

కాలి అందె కదిపిందా...... కాకి కోకిలై పోదా.....
పైట గాలి వీచిందా..... పాలవాన పడిపోదా......
రుసరుస చూసిందా ఋతువులు మారేను
గుసగుస లాడిందా ఋషులే మారేను
కదిలే నడుమే చూస్తే హరివిల్లు
బిడియం పడుతూ నీకే ప్రణమిల్లు
నడకే చూసెనంటె BATA..... పరుగే చూసెనంటె SCOOTY.....
సంతోషించి ఇచ్చుకోవా ఎంతైనా....... ||మిల మిల||