Showing posts with label కల్పన. Show all posts
Showing posts with label కల్పన. Show all posts

చెప్పాలనుంది చిన్నమాటైనా


చెప్పాలనుంది చిన్నమాటైనా..
ఒంటరి (2008)
సంగీతం: మణిశర్మ
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: ఎస్.పి. చరణ్, కల్పన

పల్లవి: 

చెప్పాలనుంది చిన్నమాటైనా..
ఆగనంది దాగనంది లోలోనా
ఇన్నాళ్ళనుండి ఉన్నమాటైనా..
ఇప్పుడేగా చెప్పమంది ప్రేమైనా

పెదవే కదిలించుకో..
మనసే వినిపించుకో...
పరదా తొలగించు కొంతైనా!

సరెలే అనిపించుకో..
త్వరగా చెయ్యందుకో
నీకోసం వేచి చూస్తున్నా...

చరణం 1:

గుండెలయలో..ఓ ఓ ధీంతధిరనా
ఎన్ని కథలో..ప్రేమ వలనా
హాయి అలలో..ఓ ఓ ఊయలవనా
రేయినదిలో.. జాబిలవనా

నీ ప్రేమలోనే మేలుకుంటున్నా
మేఘాలపైనే తేలిపోతున్నా
నాకు తెలియని నన్ను కనుగొని 
నవ్వుకుంటున్నా...

చరణం 2:

వెంటనడిచే.. ఓ ఓ నీడననుకో
జంటనడిపే .. జాడననుకో
పూలు పరిచే .. ఓ ఓ దారిననుకో
నిన్ను కలిసే .. బంధమనుకో

నా ప్రేమలోకం నువ్వే అంటున్నా
నీతో ప్రయాణం ఇష్థమేనన్నా
ప్రేమ తెలిపిన రామచిలుకను 
హత్తుకోమన్నా !
నా !

అలై పొంగెరా

అలై పొంగెరా
చిత్రం : సఖి (2000)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : వేటూరి
గానం : హరిణి , కల్పన , కళ్యాణి మీనన్

అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది
అలై పొంగెరా కన్నా ... అ అ అ

నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రాదొరా ప్రాయమున
యమున మురళీధర యవ్వన
అలై పొంగేరా కన్నా ... అ అ అ

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమునా కనుబొమ్మలటు పొంగే

కాదిలి వేణుగానం కానడ పలికే
కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీచ శకుంతమరంద మెడారి గలాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా

కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలె రచించవా
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలె ఆవేదనా ఇతర భామలకు లేని వేదనో

ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులె చిలుకు
మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా
ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా కన్నా ... అ అ అ

దొండపండు లాంటి పెదవే నీది



దొండ పండు
పెళ్ళాం ఊరెళితే (2003)
మణిశర్మ
చంద్రబోస్
హరిహరన్, కల్పన

పల్లవి: 

దొండపండు లాంటి పెదవే నీది..
అబద్దం..అంతా అబద్దం..
దూదిపింజ లాంటి పదమే నీది... 
అబద్దం.. అంతా అబద్దం..
పాలమీగడంటి నుదురే నీది.. 
అబద్దం..
పూలతీగ లాంటి నడుమే నీది..
అబద్దం..
నీ పైన నా ప్రేమ అబద్దమనకూ 
అనకూ అనకూ..

చరణం 1: 

రత్నాలు చిందేటి నవ్వేమొ నీది.. 
అబద్దం..
నిన్ను నవ్వుల్లో ముంచెత్తు బాధ్యత నాది..
ఇది నిజం
ముత్యాలు రాలేటి మాటేమొ నీది..
అబద్దం
నీ మాటకు ఊ కొట్టు ఉద్యోగం నాది... 
ఇది నిజం
నేలమీద ఉన్న దేవత నీవు..
అబద్దం
నిన్ను నమ్ముకున్న దాసుణ్ణి నేను..
ఇది నిజం
నువు పొగిడే ప్రతి పాట తీపి అబద్దం
నను మెప్పించాలనే తాపత్రయం గొప్ప వాస్తవం

చరణం 2: 

పాలసరసు లాంటి పైటేమో నీది ..
ఆ హ హ అబద్దం
నీ పైట మాటునున్న మనసేమొ నాది 
ఆ ..ఇది నిజం
గోరింట పువ్వంటి చెయ్యేమొ నీది..
అహ మళ్ళీ అబద్దం
నీ చేతిలోన ఉన్న బ్రతుకేమొ నాది..
అహా ఇది నిజం
నీలాలు కొలువున్న కళ్ళేమొ నీవి 
అబద్దం
నువ్వు కన్నెర్ర చేస్తేనే కన్నీరు నేను..
ఇది నిజం
నీ పైన అనుమానం క్షణకాలం
మన ఇద్దరి మధ్యన అనుబంధం కలకాలం