Showing posts with label ఆయనకిద్దరు (1995). Show all posts
Showing posts with label ఆయనకిద్దరు (1995). Show all posts

ఓ నా చంద్రముఖి

ఆయనకిద్దరు (1995)
రచన: భువన చంద్ర
సంగీతం: కోటి
గానం: బాలు, రాధిక తిలక్

పల్లవి : 

ఓ నా చంద్రముఖి వత్తా రాతిరికి
పెట్టెయ్ పక్కలపేరంటం
హోయ్ హోయ్ పేరంటం

సైరో సూర్యముఖా
ఎయ్‌రో జెజ్జనకా  
కానీ కిస్సుల కోలాటం
హోయ్ హోయ్ కోలాటం

మెత్తని మత్తులకొండ
నా లబ్బరు జబ్బలకండ
ఎత్తర పచ్చలజెండా
ఏసెయ్యర ముద్దులదండా
ఎడాపెడా చెడామడా ఆవో

ఓ నా చంద్రముఖి వత్తా రాతిరికి

కానీ కిస్సుల కోలాటం
హోయ్ హోయ్ కోలాటం

పేరంటం

మధుమాసపు మన్మధరాగమా



మధుమాసపు
శివరంజని రాగం
ఆయనకిద్దరు (1995)
కోటి
భువనచంద్ర
బాలు, చిత్ర

మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా
నిన్నే చూడనీ మౌనమా
ఒడే చేరనీ ప్రాణమా
మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా

ఏకాంతవేళా ఎదవీణ నేనై
రవళించనా
పులకించనా
నా ఊహ నీవై
నీ ఊహ నేనై
పెనవేయనా
పవళించినా

జత చేరాలి చేరాలి శ్వాస
తీరాలి తీరాలి ఆశ
పరువపు సరిగమలో
మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా

చిరుగాలితోనే కబురంపుతున్నా
నీ కౌగిలై కరగాలనీ
విరహాలతోనే మొరపెట్టుకున్నా
ఎదలోయలో ఒదగాలనీ

వయసూగింది ఊగింది తుళ్ళి
కౌగిళ్ళే కోరింది మళ్ళి
తనువుల తొలకరిలో

మధుమాసపు మన్మధరాగమా
మది పాడిన మంజులగీతమా
నిన్నే చూడనీ మౌనమా
ఒడే చేరనీ ప్రాణమా