December 22, 2019

నీ మూగ వీణై


నీ మూగ వీణై
చిత్రం : కిరాతకుడు (1986)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : బాలు, జానకి

నీ మూగ వీణై మోగేనా
నీ రాగ మాలై పాడేనా
అనురాగం రాగంగా
అభిమానం గీతంగా
నే పాడేనా

శిలవంటి నీ హృదయంలో
శృతి నేను కానా
ఓదార్చి నిను లాలించే
ఒడి నేను కానా
తనకంటూ ఒక మనిషంటూ
ఉంటేనే బ్రతుకు...ఊ
నిదురించే నీ హృదయంలో
కదలాడే కలనై
నీ కంటిలో కన్నీటినై
ఉంటాను ఓదార్పునై

అలిగావు నీవలిసావు
అనురాగం కరువై
రగిలావు సెగలెగిసావు
బ్రతుకంతా బరువై
మేఘాన్నై అనురాగాన్నై
చినికాను చినుకై
పులకించి నువు చిగురించి
పెరగాలి మనసై
నీ నవ్వులో నే పువ్వునై
పూస్తాను నీ కోసమై