December 22, 2019

నీ పేరే ప్రణయమా....


నీ పేరే ప్రణయమా....
చిత్రం : కిరాతకుడు (1986)
సంగీతం : ఇళయరాజా
రచన : వేటూరి
గానం : బాలు, జానకి

నీ పేరే ప్రణయమా... ప్రణయమా
నీ రూపే హృదయమా... హృదయమా
నీ ప్రేమగీతిలో సుమించే సుధాకుసుమమై
నీ చెంత చేరనా వరించే తొలి ప్రణయమై
సాగే రాసలీల
సంధ్యారాగ హేల

చరణం 1:

మనసున కురిసెను
సొగసుల మధువులు ప్రియా... ప్రియా
పెదవులు కలిపెను
పరువపు ఋతువులు ప్రియా ప్రియా
మనసున కురిసెను
సొగసుల మధువులు ప్రియా... ప్రియా
పెదవులు కలిపెను
పరువపు ఋతువులు ప్రియా ప్రియా

కౌగిలింత కావే ప్రేమదేవతా
కంటి చూపుతోనే హారతివ్వనా
నడుమును మరచిన పుడమిని వెలిసిన పడతివి నీవేలే

చరణం 2:

వలపుల వలలకు
వయసులు తగిలెను ప్రియా ప్రియా
మదనుని శరముల
సరిగమ తెలిసెను ప్రియా ప్రియా
వలపుల వలలకు
వయసులు తగిలెను ప్రియా ప్రియా
మదనుని శరముల
సరిగమ తెలిసెను ప్రియా ప్రియా

చైత్ర వీణ నాలో పూలు పూయగా
కోకిలమ్మ నాలో వేణువూదగా
కలతల మరుగున మమతలు పొదిగిన ప్రియుడవు నీవేలే