వానజల్లు జాతర
చిత్రం: దొంగల్లుడు (1993)
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, చిత్ర
బృందం:
చం చ చం చం చం చం చం
ధిననన ధిననన ధిననన ధిననన ధిననననా
ధిననన ధిననన ధిననన ధిననన ధిననననా
వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఎడా పెడా కొట్టే జల్లులో
నీ చినుకు ఆరదు
నా ఉడుకు తీరదు
చిలుకలు కిలకిల వణకగ చిలిపిగ చినుకు పడ
గొడుగులు అదరగ గొడవలు ముదరగ పిడుగు పడ
వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఎడా పెడా కొట్టే జల్లులో
పదగరిసనీరి... పదగరిసనీరి...
చరణం: 1
శ్రావణవేళ సంధ్యలలోనా
కన్నె గులాబీ కౌగిలిలోన
కరిగెనులే సోకులే
కడిగెను పూరేకులే
చినుకులు చీరైనవి పైటైనవి చలాకీ వానలో
చిటపటమంటున్నవి మాటన్నవి ప్రియా నీ వీణలో
నీ పిలుపు దాహమై
నీ మెరుపు మోహమై
ధిననన ధిననన ధిననన ధిననన ధిననననా
ధిననన ధిననన ధిననన ధిననన ధిననననా
వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఎడా పెడా కొట్టే జల్లులో
ధిననన ధిననన ధిననన ధిననన ధిననననా
చరణం: 2
ఉపిరిగాలి మువ్వల వాన
అల్లరి చేసి అల్లికలోన
మెరుపుల మేనాలలో
ఉరుములు ఊరేగెలే
అలిగిన ఓ అందమా
ఆషాడమా వయస్సే వేడిలే
బిగిసిన ఓ బింకమా
చాలించుమా మనస్సే నీదిలే
నీ తడుకు తాళమై...
నీ నడక గేయమై...
ధిననన ధిననన ధిననన ధిననన ధిననననా
ధిననన ధిననన ధిననన ధిననన ధిననననా
వానజల్లు జాతర
స్వాతిముద్దు మోతరా
ఓ ఎడా పెడా కొట్టే జల్లులో
నీ చినుకు ఆరదు
నా ఉడుకు తీరదు
చిలుకలు కిలకిల వణకగ చిలిపిగా చినుకు పడ
గొడుగులు అదరగ గొడవలు ముదరగ పిడుగు పడ