December 22, 2019

జాబిల్లి సీమనుండి జారిపడ్డ జాజిపువ్వు

జాబిల్లి సీమనుండి
వసంత (2000)
సిరివెన్నెల
బాలు, చిత్ర
వందేమాతరం శ్రీనివాస్

జాబిల్లి సీమనుండి జారిపడ్డ జాజిపువ్వు ఈప్రేమా
పాలకడలి చిలికినపుడు పైకొచ్చిన వెన్నముద్ద ఈ ప్రేమా
ఆకాశం కోకిలమ్మ ఆలపించు పంచమం ఈ ప్రేమా
చైత్రమధుర చందనాల చిందులాడు సందె గాలి ఈ ప్రేమా
అమృత జలపాతాలే అవని పైకి తుళ్ళిపడే నవరత్నగిరిశిఖరం ఈ ప్రేమా
జాబిల్లి సీమనుండి జారిపడ్డ జాజిపువ్వు ఈప్రేమా
పాలకడలి చిలికినపుడు పైకొచ్చిన వెన్నముద్ద ఈ ప్రేమా

విచ్చుకున్న వయసుతోట వసంతం ఈ ప్రేమా
ఇచ్చుకున్నకొద్ది పుట్టు అనంతం ఈ ప్రేమా
వెనక అడుగు వేయకుంటె సుఖాంతం ఈ ప్రేమా
పేదవారి గొప్పవారి ప్రశాంతం ఈ ప్రేమా
గుండెలోంచి పొంగుకొచ్చి నవ్వుతోటి మద్దతిచ్చి
కళ్ళలోంచి దూసుకొచ్చె ఈ ప్రేమా
మనసు మనసు ఒకటి చేసి మరువలేని మమతలిచ్చి
మౌనరాగమంత్రమేసె ఈ ప్రేమా
సాహసాల సంగమం ఈ ప్రేమా
సత్యం శివం సుందరం ఈ ప్రేమా
జాబిల్లి సీమనుండి జారిపడ్డ జాజిపువ్వు ఈప్రేమా

అడ్డుకట్ట వేయలేని ప్రవాహం ఈ ప్రేమా
అందమైన సృష్టిలోని తియ్యదనం ఈ ప్రేమా
నింగి నేల మారుమ్రోగు సంగీతం ఈ ప్రేమా
అంతులేని ఆనందం చిరునామా ఈ ప్రేమా
వేలవేల సాగరాలు గొంతువిప్పి ఆలపించు
విశ్వశాంతి వేద ఘోష ఈ ప్రేమా
రంగులీను సంధ్యవేళ రమ్యమైన రాత్రివేళ
కథలు చెప్పు కాంతి భాష ఈ ప్రేమా
సరస మధుర స్పందనం ఈ ప్రేమా
నందనందనందనం ఈ ప్రేమా