చిత్రం: ఆయుధం (2003)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: భీమ్స్
గానం: ఉదిత్ నారాయణ్, ఉష
పల్లవి :
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు నిను చూడకుంటే
మనసాగదయ్యో
ఏ మంత్రమేశావయ్యో
ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి నిను చేరుకుంటా
మనువాడుకుంటా
మనసంత నీదేనమ్మో
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
చరణం 1:
చల్లనీ వేళ
చింతల్లో మేడ
చక్కని రాజూ రావయ్యో
ఓయ్ రాజు వయ్యారి వగలు
ఓయ్ రాజు పుట్టించే సెగలు
నల్లనీ మేఘ
మెల్లగా రాగ
నాట్యమే రాణి చెయ్యవే
ఏయ్ రాణి కవ్వించే కళలు
ఏయ్ రాణి నీలోని హొయలు
కన్నూ కన్నూ కలిసిన వేళ కలిగెను కోరికలు
గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు
గిచ్చిందీ నన్ను గిల్లిందీ
ప్రేమ ఏదేదో నన్ను అడిగింది
ఓయ్ రాజు...
చరణం 2:
మేలుకో
నువ్వు కోరుకో
నేటి రాతిరే నన్ను ఏలుకో
ఓయ్ రాజు కలదోయి రేయి
ఓయ్ రాజు మనదేలే హాయి
దూకొచ్చే
నీలో యవ్వనం
ఒంపుసొంపుల్లో పూచే మందారం
ఏయ్ రాణి సందేల వీణ
ఏయ్ రాణి సంగీతమేళా
మావో మావో మల్లెల్లో నీ రూపే నే దాచుకున్నానులే
పిల్లో పిల్లో నీ ఒళ్ళో నే వాలి దోచేసుకుంటానులే
రారాజు రారా ఓయ్ రాజు
నీపై నా మోజు తీరు ఈరోజు
ఓయ్ రాజు...