December 26, 2019

మేడే నేడే మేడే నేడే

మేడే నేడే మేడే నేడే
చిత్రం : ఎర్ర మల్లెలు(1981)
రచన : అదృష్ట దీపక్
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బృందం

పల్లవి :

అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు
ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజు
అణగారిన శ్రమశక్తిని ఆవేశం ఊపిరిగా
కదిలించినదీ రోజు రగిలించినదీ రోజు
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 1

సమభావం మానవాళి గుండెలలో నిండగా
సకలదేశ కార్మికులకు ఈనాడే పండ గ
లోకానికి శ్రమ విలువను చాటిన రోజు
ఇది చీకటిలో చిరుదివ్వెలు వెలిగిన రోజు
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 2

వేదనలూ రోదనలూ
వేదనలూ రోదనలూ అంతరింపజెయ్యాలని
బాధల కేదారంలో శోధన మొలకెత్తింది
చిరకాలపు దోపిడిపై
తిరుగుబాటు జరిగినపుడు
చిందిన వెచ్చని నెత్తురు కేతనమై నిలిచింది
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 3

భావనలో నవచేతన పదునెక్కిన ఆలోచన
రేపటి ఉదయం కోసం రెప్పలు విప్పాయి
బిగిసిన ఈ పిడికిళ్లూ ఎగిసిన ఆ కొడవళ్లూ
శ్రామికజన సారథిగా క్రమించమని అడిగాయి
మేడే నేడే మేడే నేడే (2)

చరణం : 4

ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాల
ఎన్నెన్నో తీరులలో చెమటోడ్చే శ్రమజీవులు
ఐక్యంగా నిలవాలి కదనానికి కదలాలి
సామ్యవాద సాధనకై సమరం సాగించాలి
మేడే నేడే మేడే నేడే (3)