తిరుమల తిరుపతి వెంకటేశా
చిత్రం: ప్రేమలో పడ్డాను (1999)
గానం: మనో, కృష్ణంరాజు బృందం
సంగీతం: దేవా
జానీ... ఓహో!
సంధ్యా... ఆహా!
జానీ సంధ్య...సంధ్య జానీ
ఆహా ఓహో
సంధ్యాదేవి కారేమిటి బంగళా ఏమిటి
మనవాడి దగ్గర ఉన్నది వఠ్ఠి సముద్రమేగా
నో ప్రాబ్లెమ్ అది వదిలేయ్
సంధ్యాదేవి కలరేమిటి తెలుపు
మనవాడు నలుపు
అయినను ఫర్వాలేదు
నలుపుతెలుపుల మిక్చరైన పాత
ఎన్ఠీఆర్ పిక్చరులెన్ని చూసాం
అరే... అవును
సంధ్య పెద్ద లక్షాధికారి
సారు బికారి
ఓ ఫైలుకి వివాహమయితే సారు భాగ్యవంతులవుతారు
సారు వల్ల మనం పెద్దవాళ్ళమవుతాం
మనమైతే అందరూ అయినట్టే కదా
అందుకే....
తిరుమల తిరుపతి వెంకటేశా
మావాడి ప్రేమకొక పచ్చజెండా చూపవయ్య
తిరుమల తిరుపతి వెంకటేశా
మావాడి ప్రేమకొక పచ్చజెండా చూపవయ్య
కొండలెక్కి వస్తాం
గుండు చేసుకుంటాం
పెళ్ళి బాజా మోగించావంటే
ఎందుకూ ...?
తిరుమల తిరుపతి వెంకటేశా
మా వాళ్ళు అన్నమాట నిజం కాదు శ్రీనివాసా
పెద్దింటి పిల్లయ్యా
పేదోణ్ణి నేనయ్యా
ఆరునూరైన అతకదయ్యా
అందుకే
తిరుమల తిరుపతి వెంకటేశా
మావాడి ప్రేమకొక పచ్చజెండా చూపవయ్య
చరణం 1:
దేవదాసు ప్రేమించాడు
తాగితాగి మరణించాడు
దేవదాసు ప్రేమించాడు
తాగితాగి మరణించాడు
సలీం అనార్కలి చెలిమి కథ
అయ్యో ఏమయ్యిందో తెలుసు కదా
మన లైలామజ్ను
గతి ఏమయ్యే
మన లైలామజ్ను
గతి ఏమయ్యే
ప్రేమే చెదిరి...చితిమంటయ్యె
ప్రేమలు మనకొద్దు
అందుకే
తిరుమల తిరుపతి వెంకటేశా
మావాడి ప్రేమకొక పచ్చజెండా చూపవయ్య
చరణం 2:
ప్రేమేలేక భువి లేదు
ప్రేమించని దేవుడు లేడు
ప్రేమేలేక భువి లేదు
ప్రేమించని దేవుడు లేడు
గణపతి సిద్ధిని మనువాడే
ఆ రఘుపతి విల్లుని విరిచాడే
అరె రామా రామా జానకిరామా
అరె రామా రామా జానకిరామా
సంధ్యాదేవి నీదేలేమ్మా
హారతిచ్చి అడిగి చూద్దామా
ఎందుకూ
తిరుమల తిరుపతి వెంకటేశా
మా వాళ్ళు అన్నమాట నిజం కాదు శ్రీనివాసా
పెద్దింటి పిల్లయ్యా
పేదోణ్ణి నేనయ్యా
అరే ట్రై చేసి చూడొచ్చుగా
ఏయ్....పోవే....