December 23, 2019

ఏడుకొండలవాడ.. వెంకటేశా

ఏడుకొండలవాడ.. వెంకటేశా
చిత్రం : సోగ్గాడు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి :

ఏడుకొండలవాడ.. వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేశావు.. తిరుమలేశా
చెట్టు మీద కాయను.. సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు.. శ్రీనివాసా

ఏడుకొండలవాడ.. వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేశావు.. తిరుమలేశా
చెట్టు మీద కాయను.. సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు.. శ్రీనివాసా

ఆ...ఆ...ఆ...ఆ...ఆ...
ఏడు కొండలవాడ.. వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేశావు.. తిరుమలేశా
చెట్టు మీద కాయను.. సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు.. శ్రీనివాసా

చరణం 1 :

చిలకమ్మ తట్టితే తలుపు తీశా.. మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా..
చిలకమ్మ తట్టితే తలుపు తీశా.. మళ్ళీ చెయి జారి పోకుండా కట్టేసా..

ఆ..ఆ...ఆ.. గోరొంక గూటిలోకి వచ్చేశా.. దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా
గోరొంక గూటిలోకి వచ్చేశా.. దాచి ఉన్నదంత మనసిప్పి ఇచ్చేసా

సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేశా... సోగ్గత్తెనిక వదలనని మొండికేశా
సోగ్గాణ్ణి కౌగిట్లో చుట్టేశా... సోగ్గత్తెనిక వదలనని మొండికేశా

వెంకటేశా..ఆ...ఆ...ఆ...తిరుమలేశా
తిరుమలేశా..ఆ...ఆ...ఆ..శ్రీనివాసా
ఏడు కొండలవాడ.. వెంకటేశా
ఓరయ్యో ఎంతపని చేశావు.. తిరుమలేశా
చెట్టు మీద కాయను.. సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు.. శ్రీనివాసా

చరణం 2 :

సిగ్గుతెర నేటితో ఒగ్గేసా... పూల చెండల్లే.. నీ చేతికొచ్చేసా
సిగ్గుతెర నేటితో ఒగ్గేసా... పూల చెండల్లే.. నీ చేతికొచ్చేసా

ఆ...ఆ...ఆ..
వళ్ళంతా ముద్దులతో ముద్దరేసా.. నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా
వళ్ళంతా ముద్దులతో  ముద్దరేసా.. నువ్వోపకుంటే పెనవేసి ఒకటి చేశా

కన్నెతనం పక్కమీద  పరిచేసా... దాన్ని కడదాక కాస్తానని.. ఒట్టేసా
కన్నెతనం పక్కమీద  పరిచేసా... దాన్ని కడదాక కాస్తానని.. ఒట్టేసా

వెంకటేశా..ఆ..ఆ..ఆ.. తిరుమలేశా
తిరుమలేశా..ఆ...ఆ...ఆ..శ్రీనివాసా

ఏడుకొండలవాడ.. వెంకటేశా
ఓరయ్యో.. ఎంతపని చేసావు.. తిరుమలేశా
చెట్టు మీద కాయను.. సముద్రంలో ఉప్పును
కలిపినట్టే కలిపావు.. శ్రీనివాసా