నాలో నువ్వుండాలి...
చిత్రం: పెదబాబు (2004)
సంగీతం: చక్రి
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: బాలు, కౌసల్య
నాలో నువ్వుండాలి... నీలో నేనిండాలి
నువ్వే నేనవ్వాలి ఏనాటికీ
నా వెంట నడిచాకా....నా చెంతే చేరాకా
నువ్వంటే నేనేగా ముమ్మాటికీ
వద్దన్నా వినకుండా నువు సాయం చేస్తుంటే
పదిమందీ చూశారా బాగోదులే
ఎవరేమీ అనుకున్నా ఎగతాళే చేస్తున్నా
నీ సేవలో నిత్యం వుంటానులే...
నీతో నిమిషం మాటాడినా
నూరేళ్ల సావాసం అనిపించదా....
యుగమే క్షణమైపొతుందిగా
నీవైపు ఫలమో ఇది నీ తోడే ఒక వరమై
దొరికిందని అనిపించగ సంతోషమే
మూసిన - కనులు
దాచెను - కలలు
ఊసులే - మొదలై
ఆశలే - అలలో
నదిలో - మదిలో
ఉరికే - జడిలో
ఒకసారి - ఒడిచేరి
మురిసేనంటా...
పతిలో దైవం కనిపించగా
ప్రతిరోజు ప్రేమించీ పూజించనా
ఇలలో స్వర్గం ఇల్లేననీ
ఇల్లాలిగా నిన్నుపంపించెనా
నా గుండెకు నీ నవ్వులే నులివెచ్చని కిరణాలై
తాకినవని కలిగెను మరి ఆనందాలే
నీకిది - తెలుసు
మూగది - మనసు
నాచెలి - కురులు
పూచిన - విరులై
ఇదిగో - ఇపుడే
తకధిం - తకతై
కదలాడి - దరిచేరి
పిలిచేనంటా