నవ్వవయ్య బాబూ...
పెదబాబు (2004)
చక్రి
చక్రి, కౌసల్య, జగపతిబాబు
నవ్వవయ్య బాబూ...
నీ సొమ్మేం పోతుంది...
నీ సోకేం పోతుంది ||౨||
నవ్వు దొరబాబూ...!
అరె నీ కేమయ్యింది
చిరునవ్వే రాకుందీ ||౨||
ఆడదిలా వెంటపడీ అడుగుతుండగా
మూతినలా ముడుచుకునీ ఎంతసేపటా...
తెగ ఉరిమిన ఆకశాన నవ్వు చినుకులే
నవ్వు చినుకులే...
ఓయ్ పెదబాబూ...
||నవ్వవయ్యా||
మూటలే తరిగేనా ...
కోటలే కూలేనా
నవ్వితే ఓసారి ...
కొంపలే మునిగేనా
వింతలే జరిగేనా ...
ఇంతలో ఏవైనా నవ్వితే మనసారా...
కొండలేం కరిగేనా నేను చూడలేదురోయ్...
నువ్వు నవ్వగా
అంత కోపమెందుకోయ్...
వరుసకు బావా...
ఇదిగో ఈ వేళా నవ్వాలా
పకపకమని కిలకిలమని కాకుల రొదలా
ఏయ్... ఏంటీ!?
కోకిలా శృతిలా
||నవ్వవయ్యా||
మణులే అడిగానా...
మాన్యాలడిగానా
నువ్ తప్ప ఏమైనా...
నిన్ను నేనడిగానా
నగలే అడిగానా...
నాణ్యాలడిగానా
చిన్న నవ్వు కాకుండా...
చీరలే అడిగానా
దాచుకోకు నవ్వునీ పెదవి చాటునా
||నవ్వవయ్యా||
మణులే అడిగానా...
మాన్యాలడిగానా
నువ్ తప్ప ఏమైనా...
నిన్ను నేనడిగానా
నగలే అడిగానా...
నాణ్యాలడిగానా
చిన్న నవ్వు కాకుండా...
చీరలే అడిగానా
దాచుకోకు నవ్వునీ పెదవి చాటునా
ఫక్కుమంటు నవ్వితే చాలనుకోనా
చెబుతా వింటావా
ఇపుడైనా పడిపడి నువు
నవ్వర మరి నా అత్తకొడుకా
ఒళ్ళెలా వుందే...!?
చెబుతా వింటావా
ఇపుడైనా పడిపడి నువు
నవ్వర మరి నా అత్తకొడుకా
ఒళ్ళెలా వుందే...!?
కాదని అనకా...
ఒరేయ్ పెదబాబూ
నవ్వు దొరసానీ...
చిరునవ్వుల సవ్వడితో...
నవ్వు సందడి చేయాలి
నవ్వు నీలవేణి...
కొంటెనవ్వుల పల్లకిలో...
నిన్ను రోజూ చూడాలి
నిత్యమల్లె పువ్వులాగ
నువ్వు ముద్దుగా
నవ్వుతుంటే ముత్యమైన సాటిరాదుగా
గలగలమని నవ్వుతుంటే నాకు పండగా...
నాకు పండగా...
నవ్వు దొరసానీ...
చిరునవ్వుల సవ్వడితో...
నవ్వు సందడి చేయాలి
నవ్వు నీలవేణి...
కొంటెనవ్వుల పల్లకిలో...
నిన్ను రోజూ చూడాలి
నిత్యమల్లె పువ్వులాగ
నువ్వు ముద్దుగా
నవ్వుతుంటే ముత్యమైన సాటిరాదుగా
గలగలమని నవ్వుతుంటే నాకు పండగా...
నాకు పండగా...