December 22, 2019

చామంతి పూబంతి


చామంతి పూబంతి
చిలక్కొట్టుడు (1997)
సంగీతం: కోటి
సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ
గానం: బాలు, చిత్ర

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ యింతి నావన్ని నీవే
ఏమున్నదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమా... భావమా
మోహించే ప్రణయరాగస్వరమా

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ యింతి నావన్ని నీవే

ఓ ఓ ఓ... ఓ ఓ ఓ...
ఆ... ఆ...
కొంచమైన తాళలేక పొంచివున్న ఆశలన్ని
కంచె దాటునా కసి తెంచి రేగునా
మించిపోయి అంచుదాటే తెంచలేని హాయినంతా
పంచిపెట్టనా రుచి పెంచి ఇవ్వనా
ఆ పొద్దు ఈ పొద్దు ఆపద్దు నీ ముద్దు
దూరంగ పోవద్దు భామా
ఆలశ్యమేవద్దు ఏమాత్రమాగద్దు
ఈ హద్దులే వద్దు కామా
రావే... సొగసరి మరి మరి
విరిసిన తొలి విరి
నీకే నేను కుదిరి అదిరి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ యింతి నావన్ని నీవే

ఆకుచాటు సోకులన్ని రేకువిప్పు వన్నెలల్లీ
అందజేయనా జత పొందు చేరనా
ఓ ఓ ఓ ఓ
ఆ ఆ
గోరువెచ్చనైన తేనె దోరముద్దులోనె పంచి
చెంత చేరనా మరి కొంత కోరనా
జడ్లోన పూలన్ని పక్కల్లో రాలేటి
రాత్రిళ్ళకై నేను వేచా
కల్లోన ఓ కామకల్లోలమే రేగి
కళ్ళారగ నేడు చూశా
ఏదో తెలియని అలజడి
కలిగిన అలికిడి
నాలో కలలు కదలి మెదలి

చామంతి పూబంతి వాసంతి రావే
సిరిబంతి నీ యింతి నావన్ని నీవే
ఏమున్నదో నీ గురించి తపించు మనస్సులో
ఏమన్నదో నిను వరించి తరించు వయస్సులో
ప్రేమించే ప్రాణమా.... భావమా
మోహించే ప్రణయరాగస్వరమా