December 26, 2019

ఓ వన్నెలా వయ్యారీ



ఓ వన్నెలా వయ్యారీ
శభాష్ రాజా (1961)
సంగీతం: ఘంటసాల
రచన: సముద్రాల జూనియర్ 
గానం: జమునారాణి

ఓ వన్నెలా వయ్యారీ
చూసేవు ఎవరి దారి
మదిలోన మెదలు మధురాతిమధుర
కథలేమిటే చకోరి?
ఓ వన్నెలా వయ్యారీ
చూసేవు ఎవరి దారి
ఆహా...

పులకించు నాదు మేనూ
బులిపించు నేటి రేయీ
ఆహా...ఆహా...ఆహా...హా
పులకించు నాదు మేనూ
బులిపించు నేటి రేయీ
ఊరించు నిదుర
కనుదోయి మూయ రాదేల అలిగి పోయి
విరహాల సోలిపోయి
వేగేవు శయ్యజేరి
చెలికాని విలువ
తొలికారువలపు
వలవేయవే మిఠారీ
ఓ వన్నెలా వయారి
చూసేవు ఎవరి దారి
ఆహా...

మత్తైన పిల్లగాలీ
నెత్తావిచిమ్ము రోజా
ఆహా...ఆహా...ఆహా...హా
మత్తైన పిల్లగాలీ
నెత్తావిచిమ్ము రోజా
పోపోవె తార
పో రేయిరాజా
రాలేదు నాదు రాజా
చెలికాడు రాకపోడే
తెలవారిపోవులోనా
పలువింతలైన గిలిగింతలందు
కులికేవు తనివితీర
ఓ వన్నెలా వయారి
చూసేవు ఎవరి దారి
ఆహా...