మరల తెలుపనా
చిత్రం : స్వయంవరం(1999)
గానం : చిత్ర
రచన: భువనచంద్ర
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
మరల తెలుపనా
మప మప ని రిమ రిమ స ఆ ఆ ఆ...
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్నా చిరునవ్వుల పరిచయాన్ని -
మరల తెలుపనా||
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్ప లేక చేతకాక మనసుపడే తడబాటుని -
మరల తెలుపనా||
నిన్న లేని భావమేదొ కనులు తెరిచి కలయజూసి
నిన్న లేని భావమేదొ కనులు తెరిచి కలయజూసి
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ..
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా....