December 30, 2019

దొరల నీకు


దొరల నీకు
చిత్రం: నాలుగు స్తంభాలాట (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

దొరలనీకు కనుల నీరు
దొరలదీ లొకం,  మగ దొరల దీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శోకం
కన్నె పడుచు లా శోకం

నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో
నాల్గు దిక్కుల నడుమ పుట్టి నలిగి పోయే జగతి లో
నాలుగు పాదల ధర్మం నడవలేని ప్రగతిలో
నాలుగు స్తంబాల ఆట ఆడ బ్రతుకు తెలుసుకొ
దొరలనీకు కనుల నీరు
దొరలదీ లొకం మగ దొరలదీ  లోకం

కనులలోనే దాచుకోవే కడలి లా శోకం
కన్నె పడుచు లా శోకం.

వెన్నెలే కరువైన నాడు నింగి నిండా చుక్కలే                                         
వెన్నెలే కరువైన నాడు నింగి నిండా చుక్కలే
కన్నె గానే తల్లివైతే కంటి నిండా చుక్కలే
నాల్గు ముగముల బ్రహ్మ రాసిన కర్మ నీకిది తెలుసుకొ

దొరలనీకు కనుల నీరు
దొరలదీ లొకం మగ దొరలదీ  లొకం

కనులలోనే దాచుకోవే కడలి లా శోకం
కన్నె పడుచు లా శోకం.

కలవని తీరాల నడుమ  గంగ లాగ కదిలిపో
కలవని తీరాల నడుమ  గంగ లాగ కదిలిపో
అమ్మగా ఒక జన్మనిచ్చి అవని నీవై మిగిలిపో
నాలుగు వేదాల సారం అనుభవంలో తెలుసుకో

దొరల నీకు కనుల నీరు
దొరలదీ లొకం మగదొరలదీ  లోకం
కనులలోనే దాచుకోవే కడలి లా శోకం
కన్నె పడుచు లా శోకం.

తెలుగు సినిమా అపహాస్యం పాలెక్కువై పరిహాస్యం పాలై పోతున్న నాడు జంధ్యాల తన వంశవృక్షంతో సహా దర్శనమిచ్చి ఆదుకున్నాడు. పానుగంటి, కందుకూరి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, మునిమాణిక్యం మొదలయిన శాఖోపశాఖలతో విరాజిల్లే ఆ హాస్య కల్పవృక్షానికి మూల స్థానం లో కూర్చుని "ఫిబరే హ్యూమరసం" అని రస పిపాసులకు తన కలం నించి వెలువడిన హాస్య రస కలశాలను అందించిన తెలుగుజాతి చిరునవ్వు జంధ్యాల.

జంధ్యాల మనసు వెన్నముద్ద, కళ్ళు వెన్నెలపొద్దులు, మాట అతిసున్నితం.. సారణి వీణ మీటినట్లు, ఊపిరి వేణువూదినట్లు లలితం - నవరసాలు అతనికి నవ్వురసాలే.

హాస్యరసం కోసం మిగతా రసాలను చిన్నచూపు చూడలేదు జంధ్యాల. ఉదాత్తమైన సన్నివేశాలు సృష్టించి, ఉత్తమ సాహిత్యం గల పాటలను రాయించుకున్న రసహృదయం ఆయనది.

ప్రేమ పేరుతో మాయమాటలు మనసుకు హత్తుకునేలా చెప్పి....లేనిపోని ఆశలు రేకెత్తించి...ఆనక యువతులను వంచించే మగవారి నైజాన్ని... తనకు పుట్టిన "మరో ఆడపిల్ల" తో మాట్లాడుతున్నట్లే చెప్తూనే మగజాతిని చర్నాకోలా తో కొట్టినట్లు చెప్పిన సాహిత్యం. వేటూరి వారి కలం బలం ఈ పాటలో ప్రస్ఫుటం.