నీ మదిలో నేనే ఉంటే
చిత్రం : జగమే మాయ (1973)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుజాత
పల్లవి :
నీ మదిలో నేనే ఉంటే.. ఉంటే
నా ఒడిలో నీవే ఉంటే.. ఉంటే
నీ మదిలో నేనే ఉంటే . . నా ఒడిలో నీవే ఉంటే
గుండెల్లో వలపుల మల్లి.. గుబాళించిపోదా
నీ మదిలో నేనే ఉంటే.. నా ఒడిలో నీవే ఉంటే
బ్రతుకంతా తీయని తలపుల బంతులాట కాదా
నీ మదిలో నేనే ఉంటే.. ఉంటే.. ఉంటే
చరణం 1 :
అటు పచ్చని పచ్చిక ఉంటే.. ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే
అటు పచ్చని పచ్చిక ఉంటే.. ఇటు వెచ్చని నెచ్చెలి ఉంటే
కౌగిలిలో కన్నెవయసే.. కాగి కాగి వేగిపోతుంటే . . ఉంటే
ప్రతి నిమిషం భలే రుచి కాదా . . ప్రతి నిమిషం భలే రుచి కాదా
నీ మదిలో నేనే... ఉంటే
నా ఒడిలో నీవే... ఉంటే
గుండెల్లో వలపుల మల్లి.. గుబాళించిపోదా
నీ మదిలో నేనే ఉంటే . . ఉంటే.. ఉంటే
చరణం 2 :
కొండవాగు దూకుతుంటే.. కొంటె కోర్కె రేపుతుంటే
కొండవాగు దూకుతుంటే.. కొంటె కోర్కె రేపుతుంటే
ఇద్దరమూ తరగల మాటున నురగల చాటున ఏకమౌతుంటే . . ఉంటే . .
ప్రతి నిమిషం మరో రుచి కాదా... ప్రతి నిమిషం మరో రుచి కాదా
నీ మదిలో నేనే... ఉంటే..
నా ఒడిలో నీవే... ఉంటే
బ్రతుకంతా తీయని తలపుల బంతులాట కాదా
నీ మదిలో నేనే ఉంటే.. ఉంటే