అమ్మో అమ్మాయేనా

అమ్మో అమ్మాయేనా
వసంతం (2003)
కులశేఖర్
హరిహరన్

అమ్మో అమ్మాయేనా ఎల్లోర శిల్పమా?
రంభ ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా
కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోన నిన్ను మించే శిరిలేదే నగ్న సత్యం
నాలో ఎమో సవ్వడి ఎమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది

నిషా కళ్ళతోటి వలే వేయకమ్మ
అరె చిక్కుకోదా ఎదే చేపలా

వయ్యారాల వైపు అలా చూడకయ్య
శిరే కందిపోదా మరీ ఎర్రగా
నువ్వేకాని పువ్వు ఐతె నేను తుమ్మెద అవుతా
నువ్వే కాలి మువ్వ అయితే నేను రాగమవుతా
నిన్నే దాచుచుకుంటలే ప్రియా గుండె కోవెల్లోనా
బాపు గీసిన బొమ్మకి చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన పాటవు నీవు సఖి

ప్రియా నిన్ను చూసీ మదే మారిపోయే
అదేం మాయో గానీ వానవిల్లుగా
చెలీ నిన్ను చేరీ ఎడారైన గానీ
 వసంతాలు జల్లే పూలవెల్లువ
నువ్వే నిద్దరౌతే నేనూ జోలపాటనౌతా
నువ్వే దగ్గరైతే హాయి డోల తేలిపోతా..
చెలీ నువ్వు ఔనంటే సరాగాల సంబరమౌతా ...
నువ్వూ నేనూ ఏకమై ఇపుడే మనమవుదాం...
నింగీ నేలా సాక్షిగా ఇపుడే ఒకటవుదాం...