గోదారల్లే పొంగే నాలో సంతొషం


గోదారల్లే పొంగే నాలో సంతొషం
వసంతం (2003)
కులశేఖర్
ఎస్.ఏ. రాజకుమార్
బాలు

పల్లవి: 

గోదారల్లే పొంగే నాలో సంతొషం
గొరింటల్లే పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కళ్ళల్లోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మ గుండెల్లోన స్వాశ
కలహంస నడకల్లోన అందాల హైలెస్స
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండా నింపిందమ్మ నాలో సంగీతం

చరణం 1:

గుండెలో వేల ఆశలే 
నను ఇంతగ పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే 
పలు వింతలే చూపాయిలే
సంక్రాంతే రోజు నా మదికి
ఈ అనుభవమే నాకు కొత్తగున్నది
రానంటూనే వచ్చిందమ్మ కొంటె కోయిల
రాగలెన్నొ తీసిందమ్మ తీయతీయగ

చరణం 2:

గాలిలో మబ్బు రేకులా 
మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల 
పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి 
ఇది ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లోన ఉండాలంట ఎపుడూ ఆరాటం
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం