"ఆత్మాష్టకం" లేదా "నిర్వాణ అష్టకం"
It is said that when Ādi Śaṅkara was a young boy of eight and wandering near River Narmada, seeking to find his guru, he encountered the seer Govinda Bhagavatpada who asked him, "Who are you?". The boy answered with these stanzas, which are known as "Nirvāṇa Ṣaṭkam" or Ātma Ṣaṭkam". Swami Govindapada accepted Ādi Śaṅkara as his disciple. The verses are said to be valued to progress in contemplation practices that lead to Self-Realization.
"Nirvāṇa" is complete equanimity, peace, tranquility, freedom and joy. "Ātma" is the True Self.
పాడినవారు టంగుటూరి సూర్యకుమారి.
ఇక్కడ భానుమతి నరసింహన్ గారు పాడిన పాట
మనో బుధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణనేత్రే | న చ వ్యోమ భూమి ర్న తేజో న వాయుః చిదానంద రూపః శివోహం శివోహం ||
(నేను మనస్సు కాదు,బుద్ధి కాదు, చిత్తము కాదు,అహంకారం కూడా కాదు. నేను పంచేంద్రియాలు కాదు. నేను పంచభూతాలు కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడ్ని. నేను శివుడ్ని.)
న చ ప్రాణ సంజ్ఞో న వైపంచ వాయుః న వా సప్తధాతుర్ న వా పంచ కోశాః | నవాక్పాణి పాదౌ న చోపస్థ పాయూ చిదానంద రూపః శివోహం శివోహం ||
(నేను ప్రాణాన్ని కాదు. పంచవాయువులు నేను కాదు. సప్త ధాతువులు నేను కాదు. పంచకోశాలు నేను కాదు. కర్మేంద్రియాలు నేను కాదు.నేను చిదానంద రూపాన్ని. నేను శివుడ్ని. నేను శివుడ్ని.)
న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః | న ధర్మో న చార్ధో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహం శివోహం ||
(నాలో రాగద్వేషములు లేవు,లోభమోహాలు లేవు. నాలో మదమాత్సర్యాలు లేవు. ధర్మార్ధకామమోక్షాలు నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడ్ని. నేను శివుడ్ని..)
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ | అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూపః శివోహం శివోహం ||
(నాకు పుణ్యపాపాలు లేవు. నాకు సుఖదుఃఖాలు లేవు. మంత్రాలు,తీర్థాలు,వేదాలు,యజ్ఞాలు నేను కాదు. అనుభవించేవాన్ని నేను కాదు. అనుభవింపదగిన వస్తువు నేను కాదు. అనుభవం నేను కాదు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడ్ని. నేను శివుడ్ని. )
న మే మృత్యు శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ | న బంధు ర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపః శివోహం శివోహం ||
(నాకు జననమరణాలు లేవు. నాలో జాతి భేధాలు లేవు. నాకు తల్లిదండ్రులు లేరు. నాకు బంధుమిత్రులు లేరు. నాకు గురుశిష్యులు లేరు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడ్ని. నేను శివుడ్ని. )
అహం నిర్వికల్పో నిరాకార రూపో విభూత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణామ్ | న చా సంగతం నైవ ముక్తిర్నమేయః చిదానంద రూపః శివోహం శివోహం ||
(నాలో మార్పులు లేవు. నాకు రూపం లేదు. నేను అంతటా ఉన్నాను. సర్వేంద్రియాలను వికసింపజేస్తున్నాను. అన్నింటిలో సమానంగా ఉన్నాను. నాకు బంధమోక్షాలు లేవు. నేను చిదానంద రూపాన్ని. నేను శివుడ్ని. నేను శివుడ్ని.)