ఎన్నడు చూడని అందాలు
జ్వాలాద్వీప రహస్యం (1965)
సంగీతం: ఎస్.పీ. కోదండపాణి
రచన: నారాయణరెడ్డి
గానం: సుశీల
పల్లవి:
ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే (2)
యేవో యేవో భావాలు యెదలో పందిరి వేసెనులే (2)
వో ... ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే
చరణం 1:
పచ్చ పచ్చని తీగలన్నీ పలకరించెను నాతోనే
వెచ్చ వెచ్చని ఊహలన్నీ విచ్చుకున్నవి నాలోనే ... హోయ్ (2)
పువ్వులవిగో యవ్వనములో నవ్వుకున్నవి లోలోనే
వో ... ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే
యేవో యేవో భావాలు యెదలో పందిరి వేసెనులే
ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే
చరణం 2:
ఇంత చక్కని ఘడియలోన ఎవ్వరో నను పిలిచేది
ఇంత చల్లని గాలిలోన ఎవ్వరో నను వలచేది ... హోయ్ (2)
ఎవరికెరుక రామచిలుక ఎవరి ముంగిట వాలేది
వో ... ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే (2)
యేవో యేవో భావాలు యెదలో పందిరి వేసెనులే (2)
ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే