Showing posts with label జ్వాలాద్వీప రహస్యం (1965). Show all posts
Showing posts with label జ్వాలాద్వీప రహస్యం (1965). Show all posts

నమో నాగదేవా


నమో నాగదేవా
జ్వాలాద్వీప రహస్యం (1965)
సంగీతం: ఎస్.పీ. కోదండపాణి
గానం: మాధవపెద్ది బృందం

ఆనందరూపా
అనంతస్వరూపా
ఓం ఓం

నమో నాగదేవా
నమో దివ్యభావా
నమో నమో నమో నాగదేవా

నాగదేవా నమో నాగదేవా
నమో నమో నమో దివ్యభావా

దివ్యభావా నమో దివ్యభావా

ఆదిశేష కర్కోటక పద్మ మహాపద్మగుళిక
శంక వాసుకీ  తక్షక
పద్మనాభ కులమూలక
పాహీమ్  పాహీమ్
 
నమో నాగదేవా
నమో దివ్యభావా
నమో నమో నమో నాగదేవా
నాగదేవా నమో నాగదేవా
దివ్యభావా నమో దివ్యభావా

ఫణామణి భూషితాయా
పరమేశర భూషణాయా
సింగణాయ పన్నగాయా
ప్రణవమంద స్వరూపాయా
పాహీమ్  పాహీమ్
నమో నాగదేవా
నమో దివ్యభావా
నమో నమో నమో నాగదేవా
నాగదేవా నమో నాగదేవా
దివ్యభావా నమో దివ్యభావా

కరుణాకర వరదాయకా
కాళిదాస కందాయక
పతితరక్షకా పవనభక్షకా
భక్తపాలకా
చిద్విధాయకా
చిద్విధాయకా

ఎన్నడు చూడని అందాలు


ఎన్నడు చూడని అందాలు
జ్వాలాద్వీప రహస్యం (1965)
సంగీతం: ఎస్.పీ. కోదండపాణి
రచన: నారాయణరెడ్డి
గానం: సుశీల

పల్లవి:

ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే (2)
యేవో యేవో భావాలు యెదలో పందిరి వేసెనులే (2)

వో ... ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే

చరణం 1:

పచ్చ పచ్చని తీగలన్నీ పలకరించెను నాతోనే
వెచ్చ వెచ్చని ఊహలన్నీ విచ్చుకున్నవి నాలోనే ... హోయ్  (2)
పువ్వులవిగో యవ్వనములో నవ్వుకున్నవి లోలోనే

వో ... ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే
యేవో యేవో భావాలు యెదలో పందిరి వేసెనులే
ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే

చరణం 2:

ఇంత చక్కని ఘడియలోన ఎవ్వరో నను పిలిచేది
ఇంత చల్లని గాలిలోన ఎవ్వరో నను వలచేది ... హోయ్ (2)
ఎవరికెరుక రామచిలుక ఎవరి ముంగిట వాలేది

వో ... ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే (2)
యేవో యేవో భావాలు యెదలో పందిరి వేసెనులే (2)
ఎన్నడు చూడని అందాలు
కన్నుల ముందర తోచెనులే