సర్వం తాళ మయం...

సర్వం తాళ మయం...
చిత్రం : సర్వం తాళమయం (2019)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
సాహిత్యం : రాకేందు మౌళి
గానం : హరిచరణ్

మొదలయ్యే హృదయం సవ్వడి
గర్భాన తొలిగా
గర్వాల ఆటే ఆడి
ఆగేనే తుదిగా
గగనాలే ఘర్జించేనూ
తలబడితే మేఘాలే
సంద్రాలే హోరెత్తేనూ
కలబడితే అలలే

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొలిచేటీ రెక్కల్లో
పిలిచేనీ తాళం
జలజలజల జారే కొండల
ధ్వనిలోని చలనం
గలగలగల పారే నదుల
ధ్వనిలోని గమనం
కుహుకుహు కూసే కోయిల
ధ్వనిలోని మధురం
కిలకిలకిల ఊగే కొమ్మల
ధ్వనిలోని తన్మయం

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

పిపీలికం సరాల నడకే
వింటే స్వరతాళం కదా
మొగ్గే తుంచి తేనే జుర్రేసే
భ్రమరాల సడి తాళం వేయ్ రా
నేల మేళాన మోగించే వాన
నాట్యం చేసే చిటపట చినుకె
నీలో నిప్పు చప్పుళ్ళే అవి
నువ్వు నేనూ కాలాన్ని తాళం
జన్మించాం కలసిన లయలో
జీవించాం కల్లల లయలో
థై థై థై దిథై లయలో
తై తై తై.. తి త త

ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొదలయ్యే హృదయం సవ్వడి
గర్భాన తొలిగా
గర్వాల ఆటే ఆడి
ఆగేనే తుదిగా
గగనాలే ఘర్జించేనూ
తలబడితే మేఘాలే
సంద్రాలే హోరెత్తేనూ
కలబడితే అలలే

దేహం ప్రాణం ఆడే క్షణం
ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం

మొలిచేటీ రెక్కల్లో
పిలిచేనీ తాళం

ఈ విశ్వం తాళ మయం
సర్వం సర్వం తాళ మయం
ఈ విశ్వం తాళ మయం
తాళం లేక ఏది జగం