December 26, 2019

లాలి లాలి

లాలి లాలి
సీత రామునికోసం (2017)
సంగీతం: అనిల్ గోపిరెడ్డి
గానం: శ్వేతా మోహన్

    లాలి లాలి
    లాలి లాలి
    బజ్జోరా నా బుజ్జాయి
    లాలి లాలి
    లాలి లాలి
    నిదురపో నా బంగారి
    చిట్టితల్లిని నిదురపుచ్చే
    అమ్మ నేనై పాడనా
    అమ్మ కోసం అమ్మై వచ్చిన
    నీకు జోల పాడనా
    నిదురపోయే లోకమంతా
    కనులుమూసే వేళ
    కలతలన్నీ కరిగిపోయి
    కలలు చేరే వేళ

    లాలి లాలి
    లాలి లాలి
    బజ్జోరా నా బుజ్జాయి
    లాలి లాలి
    లాలి లాలి
    నిదురపో నా బంగారి

    దివిలోనంట
    బంగరు స్వర్గమంట
    భువిలోనంట
    రంగుల లోకమంట
    వెలుగులన్నీ దీపాలై
    మా ముంగిటే నిలిచెనే
    అంతులేని ఆనందాలే
    గుండెలో ఒదిగేనే
    ఏ బంధమంటూ లేని నాకు
    ఆత్మ బంధువు దొరికెలే
    ఆ రాముడై నా తోడునిలిచి
    దీవెనే ఇచ్చెలే
    ఈ జన్మకీ నువ్వుతోడువై
    ఉండగా చాలులే

    లాలి లాలి
    లాలి లాలి
    బజ్జోరా నా బుజ్జాయి
    లాలి లాలి
    లాలి లాలి
    నిదురపో నా బంగారి
 
    కలలోనంట
    వింతల లోకమంట
    ఆ లోకానికి నువ్
    రాణివై ఏలమంట
    నీకోసం జాబిలే
    బంతిగా మారులే
    వెన్నెలే నీ తోడుగా
    నేస్తమై చేరులే
    మబ్బులన్నీ పానుపల్లే
    నిన్ను ఊయలలూపగా
    చుక్కలన్నీ నీచెక్కిల్లకు
    మెరుపులై చేరగా
    ఆ కన్నయ్యే నీ కోసం
    వేణువై పాడగా

    లాలి లాలి
    లాలి లాలి
    బజ్జోరా నా బుజ్జాయి
    లాలి లాలి
    లాలి లాలి
    నిదురపో నా బంగారి