December 26, 2019

రాజశేఖరా ఆగలేనురా


రాజశేఖరా...
చిత్రం: ముగ్గురు మొనగాళ్ళు (1994)
సంగీతం: విద్యాసాగర్
సాహిత్యం: వెన్నలకంటి
గానం: యస్. జానకి, యస్. పి. బాలు

రాజశేఖరా ఆగలేనురా
రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖి చెలి తేనె జాబిలి
తీరని సుఖాలలో తీపి ఆకలి

రాజశేఖరా – ఓ సఖి చెలి

చాటుగా తెర చాటుగ కసి కాటులో పెదవే
ఘాటుగా అలవాటుగా ఒడి పాఠమే చదివే
చిరు చిత్రాలతో… నడుమే అడిగే వగలే
మధు పత్రాలతో… నలుగే పెరిగే చెరలే
శృంగార గంగ పొంగేటి వేళ రుచులే మరిగే మత్తులో

రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖి చెలి తేనె జాబిలి

కొంటెగా తొలి రాతిరి చలి మంటలే పుడితే
జంటలో కసి చాకిరి గిలి గంటలే కొడితే
గురి చూసెయ్యవా… సొగసే బిగిసే సుడిలో
తెర తీసెయ్యవా… ఎదలో కరిగే బడిలో
నా లేత ఒళ్ళు నీ చూపు ముళ్ళు తగిలే రేయిలో

రాజశేఖరా ఆగలేనురా
పైటలో స్వరాలనే మీటి చూడరా
ఓ సఖి చెలి తేనె జాబిలి
తీరని సుఖాలలో తీపి ఆకలి